LOADING...
GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే
గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే

GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2025
07:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌ను చైన్నై సూపర్ కింగ్స్ విజయంలో ముగించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 83 పరుగుల తేడాతో ఓడించి, టోర్నీ నుంచి తప్పుకుంది. 231 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు 18.3 ఓవర్లలో కేవలం 147 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రమే 41 పరుగులతో నిలవగా, మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, గుజరాత్ బ్యాటర్లను పెవిలియానికి పంపారు. నూర్ అహ్మద్, కాంబోజ్ ఇద్దరూ కలిపి 3 వికెట్లు పడగొట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

83 పరుగుల తేడాతో సీఎస్కే విజయం