GT Players: గుజరాత్ టైటాన్స్ బస్సులో మంటలు.. ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన కొద్దిసేపటికే గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఊహించని ఘటన ఎదురైంది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రయాణిస్తున్న జట్టు బస్సులో ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా పొగలు రావడంతో అందరూ అప్రమత్తమయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. పరిస్థితిని గమనించిన వెంటనే ఆటగాళ్లు, సిబ్బంది బస్సు నుంచి సురక్షితంగా బయటకు దిగిపోయారు. అందరూ బస్సు నుంచి దిగిన అనంతరం మంటలు చెలరేగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొంతసేపు రోడ్డుపైనే వేచి ఉన్న జట్టు సభ్యులను అనంతరం మరో బస్సులో వారి హోటల్‌కు తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో జట్టు సభ్యులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
వివరాలు
హోటల్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో ఘటన
కాగా, అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు నిరాశ ఎదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం జట్టు హోటల్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది.