
DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్ టైటాన్స్ మరోసారి అదిరిపోయే ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. 200 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలోనే చేధించి, 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ విజయంలో గుజరాత్‌కు ఇది ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ఘనత సాధించింది. సాయి సుదర్శన్ అద్భుతమైన శతకంతో మెరిశాడు.
ఆయన 61 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో అజేయంగా 108 పరుగులు చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు. ఇది ఆయనకు ఐపీఎల్‌లో రెండో శతకం కావడం విశేషం.
Details
చెలరేగిన గిల్
ఇక మరో ఓపెనర్ గిల్ కూడా తనదైన శైలిలో అలరించాడు.
కేవలం 53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 93 పరుగులు చేయగా, చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.
వీరిద్దరి అజేయ భాగస్వామ్యంతో గుజరాత్ టైటాన్స్ సునాయాసంగా గెలుపొందింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫ్లే ఆఫ్స్ కు చేరిన గుజరాత్
𝗡𝗲𝘅𝘁 𝗦𝘁𝗼𝗽: 𝗣𝗹𝗮𝘆𝗼𝗳𝗳𝘀 📍
— IndianPremierLeague (@IPL) May 18, 2025
Led by Shubman Gill, the 𝙂𝙪𝙟𝙖𝙧𝙖𝙩 𝙏𝙞𝙩𝙖𝙣𝙨 have made it to their third Top 4️⃣ finish in four years 🔥#GT fans, 2️⃣nd title loading? 🤔#TATAIPL | #DCvGT | @gujarat_titans pic.twitter.com/uJSCIFt9ub
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శతకం బాదిన సాయి సుదర్శన్
𝙎𝙖𝙞-𝙙 𝙞𝙩 𝙬𝙞𝙩𝙝 𝙖 𝙎𝙄𝙓 🫡
— IndianPremierLeague (@IPL) May 18, 2025
A stunning century in a dream season for #GT star Sai Sudharsan 💙
Updates ▶ https://t.co/4flJtatmxc #TATAIPL | #DCvGT | @gujarat_titans | @sais_1509 pic.twitter.com/O0vzstT1gD