Page Loader
MI vs GT: ముంబయి ఇండియన్స్‌ని చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్
ముంబయి ఇండియన్స్‌ని చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్

MI vs GT: ముంబయి ఇండియన్స్‌ని చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2025
11:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆహ్మదాబాద్ వేదికగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ముంబయి బ్యాటర్లలో రోహిత్ శర్మ (8), రాబిన్ మిర్జ్ (3), ర్యాన్ రికెల్టన్ (6) తీవ్రంగా నిరాశపరిచారు. సూర్యకుమార్ యాదవ్ (48), తిలక్ వర్మ (39) కొద్దిసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మిడిల్ ఓవర్లలో స్లోగా ఆడటంతో రన్ రేట్ పెరిగిపోయింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ షాట్ కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు.

Details

రాణించిన గుజరాత్ బౌలర్లు

ముఖ్యంగా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా చివర్లో 17 బంతులు ఆడి 11 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు తీసి ముంబయి బ్యాటర్లను కట్టడి చేశారు. సాయి సుదర్శన్ (63), జోస్ బట్లర్ (39), కెప్టెన్ శుభమాన్ గిల్ (38) రాణించడంతో గుజరాత్ భారీ స్కోరు చేయగలిగింది. ఈ టోర్నీలో వరుసగా ముంబైకి ఇది రెండో ఓటమి కాగా, గుజరాత్ టైటాన్ మొదటి విజయాన్ని నమోదు చేసింది

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రెండు వికెట్లు పడగొట్టిన సిరాజ్