
GT vs SRH: గుజరాత్ గెలుపు.. సన్‌రైజర్స్‌కు ఏడో ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మైదానం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 38 పరుగులతో విజయం సాధించింది.
తొలుత గుజరాత్ బ్యాట్స్‌మెన్ అద్భుత ఆటతీరు కనబర్చారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (76 పరుగులు - 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (64 పరుగులు - 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (48 పరుగులు -23 బంతుల్లో 9 ఫోర్లు) చెలరేగిన ఫలితంగా, గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు నమోదుచేసింది.
హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో ఉనద్కత్ 3 వికెట్లు తీయగా, కమిన్స్,అన్సారీ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.
వివరాలు
చెలరేగినా ఓపెనర్ అభిషేక్ శర్మ
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమైంది.
ఓపెనర్ అభిషేక్ శర్మ (74 పరుగులు - 41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) దూకుడుగా ఆడినా, మిగిలిన బ్యాట్స్‌మెన్ అందుకు అనుగుణంగా రాణించకపోవడంతో ఆజట్టు గెలుపు తీరాలకు చేరలేకపోయింది.
క్లాసెన్ (23 పరుగులు - 18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్), నితీశ్ కుమార్ రెడ్డి (21 నాటౌట్ - 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), ప్యాట్ కమిన్స్ (19 నాటౌట్ - 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) స్వల్ప స్థాయిలో మద్దతునిచ్చినప్పటికీ జట్టు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
వివరాలు
హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
గుజరాత్ బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధ్ కృష్ణ మరియు ముహమ్మద్ సిరాజ్ తలో 2 వికెట్లు తీసారు.
ఇక ఇషాంత్ శర్మ, కొయిట్జీ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో కలిసి మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు ఇది ఏడో ఓటమిగా నమోదైంది.
ఫలితంగా హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. మరోవైపు, గుజరాత్ 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి దూసుకెళ్లింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
38 పరుగులతో గుజరాత్ టైటాన్స్ విజయం
🔥 Gujarat Titans are back on track with a dominant 38-run win! 💪
— wicketbuzz (@wicketbuzz) May 2, 2025
A sensational all-round show, led by powerful batting performances! 🙌#GujaratTitans #GTvsSRH #IPL2025 #BackOnTrack #BattingBrilliance #WinningWays #CricketAction #WicketBuzz #IPLHighlights #CricketFever
📸… pic.twitter.com/i36wvwJesC