Page Loader
Chess Player Gukesh:ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా చరిత్ర సృష్టించిన యువ ప్లేయర్ గుకేశ్..
ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా చరిత్ర సృష్టించిన యువ ప్లేయర్ గుకేశ్..

Chess Player Gukesh:ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా చరిత్ర సృష్టించిన యువ ప్లేయర్ గుకేశ్..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2024
07:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌ అంతర్జాతీయ చెస్‌లో సంచలనం సృష్టించాడు. అతడు ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని ఘనత సాధించాడు. తుది పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డింగ్ లిరెన్‌ (చైనా)ను ఓడించి విజయకేతనం ఎగురవేశాడు. గురువారం జరిగిన 14వ రౌండ్‌లో నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన కఠినమైన గేమ్‌లో చివరకు గుకేశ్‌ విజయం సాధించాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను గెలుచుకున్న రెండో భారతీయుడిగా గుకేశ్ చరిత్రలో నిలిచాడు.

వివరాలు 

14వ రౌండ్‌లో గుకేశ్‌ అదృష్టాన్ని తనవైపు తిప్పుకుని..

తత్ఫలితంగా ఈ విజయాన్ని బుధవారమే సాధించాలని భావించినా, 13వ రౌండ్‌లో సుమారు 5 గంటల పాటు సాగిన గేమ్‌లో ఇద్దరు ఆటగాళ్లు పాయింట్లు పంచుకున్నారు. గుకేశ్‌ 18 ఏళ్ల పటుత్వంతో గట్టిగా పోరాడినా, 32 ఏళ్ల డింగ్ లిరెన్‌ ప్రశాంతమైన ఆడకతో అవకాశాన్ని ఇవ్వలేదు. 68 ఎత్తుల తర్వాత గేమ్‌ను ఫలితం లేకుండానే ముగించేందుకు ఇద్దరూ అంగీకరించారు. కానీ ఇవాళ జరిగిన 14వ రౌండ్‌లో గుకేశ్‌ అదృష్టాన్ని తనవైపు తిప్పుకుని విజయంతో మరో పాయింట్‌ సాధించి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా నిలిచాడు.