Page Loader
Gukesh: ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన దొమ్మరాజు గుకేశ్‌

Gukesh: ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన దొమ్మరాజు గుకేశ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ మరోసారి ప్రపంచ నెంబర్‌వన్‌ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను మట్టికరిపించాడు. క్రొయేషియాలో జరుగుతున్న గ్రాండ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ర్యాపిడ్‌ విభాగానికి సంబంధించిన ఆరో రౌండ్లో గుకేశ్‌ కార్ల్‌సన్‌పై ఘన విజయం సాధించాడు. ఈ టోర్నీలో గుకేశ్‌ను బలహీన ఆటగాడిగా అభివర్ణించిన కార్ల్‌సన్‌పై భారత ఆటగాడు విజయం సాధించడం విశేషం. ఇప్పటివరకు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అబ్దుసతారోవ్‌, అమెరికాకు చెందిన ఫాబియానో కరువానాలపై కూడా గుకేశ్‌ విజయాలను అందుకున్నాడు. టోర్నీలో ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి గుకేశ్‌ 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పోలెండ్‌కి చెందిన డుడా 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. గడిచిన నెల నార్వే చెస్‌ టోర్నమెంట్‌లోనూ కార్ల్‌సన్‌పై గుకేశ్‌ గెలుపొందిన విషయం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన దొమ్మరాజు గుకేశ్‌