Harbhajan Singh: పాకిస్థాన్‌కు హర్భజన్ గట్టి కౌంటర్.. ఇష్టం లేకపోతే భారత్‌కు రాకండి!
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీసీఐ, ఐసీసీకి చేసిన విజ్ఞప్తి మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రారంభంలో హైబ్రిడ్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహించే అవకాశాన్ని నిరాకరించింది. వారు ఇప్పుడు ఈ పద్ధతికి అంగీకరించారు. అయితే పీసీబీ తన పన్నెండేళ్ల హామీపై మెలిక పెట్టింది. పాక్ జట్టు ఐసీసీ టోర్నీల కోసం భారత్‌కు రాకూడదని, అవి కూడా తటస్థ వేదికల్లో జరగాలని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించారు. మీకు ఇష్టం లేకపోతే భారత్‌కు రాకూడదని, ఇందులో తమకు ఏ బాధ కూడా లేదన్నారు.
పాకిస్థాన్ లో పరిస్థితులు మెరుగుపడాలి
పాకిస్థాన్ జట్టు భారత్‌కు రాకపోతే ఎవరు పట్టించుకోరని, మీరు ఏ క్రికెటర్‌ను అడిగినా అదే సమాధానం చెబుతారన్నారు. పాకిస్థాన్‌లో పరిస్థితులు సరిగా మారిన తర్వాత ఈ విషయం వేరేలా ఉంటుందని హర్భజన్ చెప్పారు. హర్భజన్ పాకిస్థాన్‌లో క్రికెట్ మ్యాచ్‌ల కోసం తన గత పర్యటనలను గుర్తు చేసుకున్నారు. తాను అక్కడికి వెళ్లినప్పుడు ఆతిథ్యాన్ని అద్భుతంగా ఇచ్చారని, ప్రతి వారం వారు తమతో భోజనం చేసినప్పుడు డబ్బులు తీసుకోలేదన్నారు. శాలువాలు బహుమతిగా ఇచ్చారని అన్నారు. పాక్ క్రికెట్ అభిమానులు ఇండియాలో స్టార్ ఆటగాళ్ల ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోతున్నందుకు ఆయన తీవ్ర బాధను వ్యక్తం చేశారు. ఇందులో పాక్ అభిమానుల తప్పేమీ లేదని, పరిస్థితులు మెరుగుపడేవరకు ఇలాగే ఉంటుందని హర్భజన్ వివరించారు.