LOADING...
Virat Kohli: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎందుకని ప్రశ్నించిన హర్భజన్ కూతురు
టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎందుకని ప్రశ్నించిన హర్భజన్ కూతురు

Virat Kohli: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎందుకని ప్రశ్నించిన హర్భజన్ కూతురు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఘటనపై నెటిజన్లు, అభిమానులే కాదు.. చిన్నారులు కూడా స్పందిస్తున్నారు. టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఎనిమిదేళ్ల కుమార్తె హినాయ కోహ్లీని రిటైర్మెంట్ గురించి ఎలా ప్రశ్నించిందో తాజాగా మీడియాతో పంచుకున్నారు.

Details

హినాయ సందేశానికి కోహ్లీ రిప్లై 

"విరాట్ రిటైర్మెంట్ ప్రకటించాక మా కూతురు హినాయ కూడా చాలా ఆవేదనకు గురైంది. అప్పుడు తానే స్వయంగా సెల్‌ఫోన్‌లో విరాట్‌కు మెసేజ్ చేసింది. 'దిస్ ఈజ్ హినాయ.. విరాట్, వై డిడ్ యు రిటైర్?' అని అడిగింది. కొద్ది సేపటికే కోహ్లీ స్పందిస్తూ 'బేటా, ఇట్స్ టైం..' అని రిప్లై చేశాడు. నేను కూడా అదే ప్రశ్నను కోహ్లీకి అడిగాను. ఏది తనకు ఉత్తమమో అతడికి బాగా తెలుసునని హర్భజన్ వివరించారు.

Details

టెస్టు జట్టు నాయకత్వంపై హర్భజన్ స్పందన

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గురించి హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. "గిల్‌ నాయకత్వానికి ఎంపిక చేయడం మంచి నిర్ణయం. యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వాల్సిన సమయం ఇది. కానీ ఇంగ్లండ్ టూర్ సులభం కాదు. కోహ్లీ, రోహిత్ లాంటి అనుభవజ్ఞుల లేని ఈ భారత జట్టుకు కచ్చితంగా కష్టమైన సిరీస్ అవుతుంది. ఒక విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాను - టూర్ మొదలవకముందే అంచనాలు వేయొద్దు. ఓడినా ఫర్వాలేదు. వాళ్లు నేర్చుకుంటారు. గిల్, పంత్ లాంటి ఆటగాళ్లు ఉన్న యువ బృందం మంచి ప్రదర్శన చేస్తుందన్న నమ్మకం తనకు ఉందని హర్భజన్ ధీమా వ్యక్తం చేశారు.