Hardik Pandya: టీమిండియాకు గట్టి షాక్.. పాండ్యా కోలుకోవడం కష్టమే!
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మంచి జోరుమీదున్న టీమిండియా గట్టి షాక్ తగిలింది. బంగ్లాదేశ్ మ్యాచులో బౌలింగ్ చేస్తూ గాయపడిన స్టార్ ఆల్ రౌండర్ హర్థిక్ పాండ్యా .. జట్టుకు దూరమయ్యే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అనుకున్న దాని కంటే పాండ్యా తీవ్రమైందని తెలుస్తోంది. మొదట రెండు మ్యాచులకు దూరమైన పాండ్యా, తర్వాత టోర్నీ మొత్తానికి దూరమయ్యే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది. తొలుత చీలమండ గాయమని భావించినప్పటికీ లింగమెంట్(ఆస్థిబంధనం)లోనూ చీలక బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమైతే హార్ధిక్ నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
గాయంపై ఎలాంటి ప్రకటన ఇవ్వని బీసీసీఐ
ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం పాండ్యా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) పర్యవేక్షణలో ఉన్నారు. ఒకవేళ హార్ధిక్ ఫాండ్యా టోర్నీకి దూరమైతే అతడి స్థానంలో ఎవరు ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది. జట్టులో పేస్ ఆల్‌రౌండర్ పాత్రను పోషించే ఆటగాళ్లకు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్ ఉన్నారు. అయితే ఇప్పటికే జట్టులో స్పిన్ ఆల్ రౌండర్లు ఇద్దరు ఉన్నారు.