Page Loader
Hardik Pandya-Tilak Varma:'బయట వ్యక్తులకు ఏమి తెలియదు'..  తిలక్ వర్మ 'రిటైర్డ్‌ ఔట్‌'పై హార్దిక్‌ పాండ్య
'బయట వ్యక్తులకు ఏమి తెలియదు'..  తిలక్ వర్మ 'రిటైర్డ్‌ ఔట్‌'పై హార్దిక్‌ పాండ్య

Hardik Pandya-Tilak Varma:'బయట వ్యక్తులకు ఏమి తెలియదు'..  తిలక్ వర్మ 'రిటైర్డ్‌ ఔట్‌'పై హార్దిక్‌ పాండ్య

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఇది నాలుగో ఓటమి. ముంబయి స్వస్థలమైన వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఉత్కంఠభరిత పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్య (42) పోరాడినప్పటికీ విజయం మాత్రం అందుకలేకపోయారు. గత మ్యాచ్‌లోనూ(లఖ్‌నవూ)సరిగ్గా 12 పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో తిలక్ వర్మ'రిటైర్డ్ ఔట్' కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్య, కోచ్ మహేల జయవర్థనే ఈ విషయంపై వివరణనిచ్చారు. ఇక ఇప్పుడు తిలక్ అర్ధ సెంచరీ సాధించడంతో మళ్లీ ముంబయి టీం మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హార్దిక్ మళ్లీ స్పందించారు.

వివరాలు 

"బౌలర్లపై తప్పుపట్టలేం" - హార్దిక్ వివరణ 

''వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బౌలర్లను నిందించడం న్యాయమయ్యదు. మా బ్యాటింగ్ క్రమంలో ఎక్కువ ఆప్షన్లు లేవు. నమన్ ధిర్ సాధారణంగా డౌన్ ఆర్డర్‌లోకి వస్తాడు. కానీ, గత మ్యాచ్‌లో రోహిత్ అందుబాటులో లేకపోవడంతో అతడు ముందుగా బ్యాటింగ్‌కు వెళ్లాడు. ఆ సందర్భంలో నమన్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. రోహిత్ తిరిగి వచ్చిన తర్వాత, నమన్‌ను మళ్లీ లోయర్ ఆర్డర్‌కు పంపించాం. తిలక్ వర్మ ఆ మ్యాచ్‌లోనూ బాగా ఆడాడు," అని హార్దిక్ తెలిపాడు.

వివరాలు 

లఖ్‌నవూతో మ్యాచ్‌కు ముందు రోజు తిలక్ వేలికి గాయం 

"చాలామంది మాట్లాడినప్పటికీ, వారికి తెలియని విషయం ఏమిటంటే.. లఖ్‌నవూతో మ్యాచ్‌కు ముందు రోజు తిలక్ వేలికి బంతి బలంగా తాకింది. అందుకే అతడు పూర్తిగా ఆడలేకపోయాడు. రిటైర్డ్ ఔట్ చేయడంలో వ్యూహం ఉండడంతో పాటు, గాయం కారణంగా కూడా ఆ నిర్ణయం తీసుకున్నాం. కొత్త బ్యాటర్‌తో ఆటకు దూకుడునివ్వాలన్న కోచ్ ఆలోచన మేరకే తిలక్‌ను పిలిపించాం. ఇప్పుడు తిలక్ ఆర్సీబీపై అద్భుతంగా ఆడాడు," అని హార్దిక్ వివరించారు.

వివరాలు 

"పవర్‌ప్లేలో వికెట్లు కోల్పోవడం కీలకం"..హార్దిక్ విశ్లేషణ 

''వాంఖడే వేదికపై 220కి పైగా లక్ష్యాన్ని ఛేదించడం సాధ్యమే. అయితే పవర్‌ప్లేలో వికెట్లు పడిపోవడం మా పై ఒత్తిడిని పెంచింది. కొన్ని ఓవర్లలో పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాం. దీంతో మ్యాచ్‌లో వెనుకబడిపోయాం. డెత్ ఓవర్లలో కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయాం. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా తిరిగి మైదానంలోకి రావడం సానుకూల అంశం," అని హార్దిక్ పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 221/5 స్కోరు చేయగా, ఛేదనలో దిగిన ముంబయి 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది.