LOADING...
Hardik Pandya: అరుదైన రికార్డుకు చేరువలో హార్ధిక్ పాండ్యా.. ఆసియా కప్‌లో సాధ్యమా?
అరుదైన రికార్డుకు చేరువలో హార్ధిక్ పాండ్యా.. ఆసియా కప్‌లో సాధ్యమా?

Hardik Pandya: అరుదైన రికార్డుకు చేరువలో హార్ధిక్ పాండ్యా.. ఆసియా కప్‌లో సాధ్యమా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2025
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన రికార్డు సాధించడానికి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 పరుగులు, 100 వికెట్లు పూర్తిచేసిన తొలి భారత ఆటగాడిగా నిలవబోతున్నాడు. ప్రస్తుతం అతడికి ఈ ఘనత సాధించడానికి కేవలం 6 వికెట్లు మాత్రమే అవసరం. ఇప్పటి వరకు హార్దిక్‌ పాండ్యా 114 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్‌లో 27.9 సగటుతో 1812 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 94 వికెట్లు సాధించాడు. మూడు సార్లు నాలుగు వికెట్లు తీశాడు. అతడి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 4/16.

Details

ఆసియా కప్‌లోనే రికార్డు దిశగా?

సెప్టెంబర్‌ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాండ్యాకు ఆరు వికెట్లు తీయడానికి అవకాశముంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌10న యూఏఈతో ఆడనుంది. భారత్, పాక్‌ జట్లు సెప్టెంబర్‌ 14న తలపడనున్నాయి. లీగ్‌ దశలో భారత్‌ చివరి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 19న ఒమాన్‌తో ఆడనుంది. అనంతరం సూపర్‌-4 దశ జరగనుంది. వికెట్ల జాబితాలో హార్దిక్‌ స్థానమేంటి? ప్రస్తుతం భారత్‌ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు. అతడి ముందు అర్ష్‌దీప్‌ సింగ్‌, యుజ్వేంద్ర చాహల్‌ మాత్రమే ఉన్నారు. ఆసియా కప్‌లో చాహల్‌ను అధిగమించే అవకాశాలు హార్దిక్‌కు బలంగా కనిపిస్తున్నాయి.

Details

భారత్‌ తరఫున టీ20 క్రికెట్‌లో టాప్‌ వికెట్‌టేకర్లు

అర్ష్‌దీప్‌ సింగ్‌ - 63 మ్యాచ్‌లు - 99 వికెట్లు యుజ్వేంద్ర చాహల్‌ - 80 మ్యాచ్‌లు - 96 వికెట్లు హార్దిక్‌ పాండ్యా - 114 మ్యాచ్‌లు - 94 వికెట్లు భువనేశ్వర్‌ కుమార్‌ - 87 మ్యాచ్‌లు - 90 వికెట్లు జస్‌ప్రీత్‌ బుమ్రా - 70 మ్యాచ్‌లు - 89 వికెట్లు ఆసియా కప్‌ 2025లోనే హార్దిక్‌ పాండ్యా ఈ అరుదైన ఘనత అందుకుంటాడేమో చూడాలి.