తదుపరి వార్తా కథనం
Hardik Pandya: హార్దిక్ పాండ్యా క్లాస్ షాట్.. అలవోకగా ఇలాగూ కొట్టేయొచ్చా సిక్స్? (వీడియో)
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 07, 2024
10:02 am
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
తొలుత బౌలింగ్‌లో ఓ వికెట్ తీసిన పాండ్యా, తర్వాత బ్యాటింగ్‌లో 16 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో పాండ్యా కొట్టిన ఓ షాట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
అయితే బంగ్లా బౌలర్ రిషద్ వేసిన 11 ఓవర్‌లో అదిరిపోయే సిక్స్ కొట్టాడు. డీప్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచులో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.