LOADING...
Hardik Pandya: మళ్లీ గాయపడిన హార్దిక్ పాండ్యా? ఐపీఎల్ కి దూరమయ్యే అవకాశం.. 
మళ్లీ గాయపడిన హార్దిక్ పాండ్యా? ఐపీఎల్ కి దూరమయ్యే అవకాశం..

Hardik Pandya: మళ్లీ గాయపడిన హార్దిక్ పాండ్యా? ఐపీఎల్ కి దూరమయ్యే అవకాశం.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 15, 2024
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2024కి ముందు,ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ గెలిచింది. 17వ సీజన్‌కు ముందు, రోహిత్ ను కెప్టెన్సీ నుండి తొలగించి, ఆ బాధ్యతను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. అయితే, ఇప్పుడు ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా మళ్లీ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా స్ట్రెచర్‌పై పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడికి గాయాలయ్యాయని, ఫిజియో చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.

Details 

రోహిత్ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్‌కి సారథ్యం వహిస్తాడా..?

ఈ వీడియో వెనుక అసలు నిజమెంతో తెలియలేదు కానీ.. పాండ్యా ఎక్స్‌ప్రెషన్‌ చూస్తుంటే ప్రాక్టీస్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. అయితే,ఈ వార్తను ధృవీకరించాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్ 2023 సమయంలో గాయపడ్డాడు. దీంతో తరువాత అతను టోర్నమెంట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు హార్దిక్ నిజంగా గాయపడితే ముంబై ఇండియన్స్ వ్యూహాలన్నీ గల్లంతవుతాయి. అతని బ్యాకప్ గురించి జట్టు ఆలోచించినప్పటికీ, హార్దిక్ లేకుండా ప్లాన్ ఖచ్చితంగా ఉంటుందా లేదా అనేది ఇప్పటికీ పెద్ద విషయమే . హార్దిక్ పాండ్యా కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకుంటే, రోహిత్ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్‌కి సారథ్యం వహిస్తాడా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ఇదే..