
Hardik Pandya: ఆసియా కప్‌లో గాయపడ్డ హార్ధిక్ పాండ్యా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ (Asia Cup) గెలిచి జోష్‌లో ఉన్న భారత జట్టు, అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ టూర్‌లో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 సిరీస్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు జరుగనుంది. అయితే వన్డే మ్యాచ్‌లకు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్య (Hardik Pandya) దూరం కావడం అనుమానంగా ఉంది. ఆసియా కప్‌లో గాయపడిన పాండ్య, ఫైనల్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆడకపోవడం తెలిసిందే. ఎడమ కాలి తొడ కండరానికి గాయం కారణంగా హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్‌గా లేడు.
Details
కోలుకోవడానికి నాలుగు వారాల సమయం
అతడు కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం కావచ్చని సమాచారం వస్తోంది. ఐదుగురు టీ20 మ్యాచ్‌లలో మాత్రం అతడు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆసియా కప్‌లో భారత్ విజయంలో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. జస్పిత్ బుమ్రా (Jasprit Bumrah)తో కలిసి కొత్త బంతులను పంచుకున్నాడు.
Details
అధికారిక ప్రకటన వెలువడలేదు
అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌లో కీలకమైన పరుగులు చేశారు. అయితే సూపర్4లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గాయపడటం వల్ల, పాండ్య ఆ మ్యాచ్‌లో కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత మైదానాన్ని వీడాడు, తన ఆరు బంతుల్లో ఒక వికెట్ మాత్రమే తీసుకోగలిగాడు. చివరికి ఆ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లి, భారత్ విజేతగా నిలిచింది. ఈ ఆస్ట్రేలియా టూర్‌తో టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma) విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డేల్లో పునరాగమనం చేసే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరూ ఇప్పటికే టీ20లు, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.