LOADING...
Hardik Pandya: ఫొటోగ్రాఫర్లపై హార్దిక్ పాండ్య ఆగ్రహం.. ఆడవారికి గౌరవం ఇవ్వాలంటూ ఫైర్!
ఫొటోగ్రాఫర్లపై హార్దిక్ పాండ్య ఆగ్రహం.. ఆడవారికి గౌరవం ఇవ్వాలంటూ ఫైర్!

Hardik Pandya: ఫొటోగ్రాఫర్లపై హార్దిక్ పాండ్య ఆగ్రహం.. ఆడవారికి గౌరవం ఇవ్వాలంటూ ఫైర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌(Asia Cup) సందర్భంగా గాయపడి టీమిండియా(Team India) నుంచి దూరమైన హార్దిక్ పాండ్య(Hardik Pandya), దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ మైదానంలో అడుగు పెట్టబోతున్నాడు. ఇంకా కొన్ని గంటల్లో కటక్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా, ఈ క్రమంలో హార్దిక్ మంగళవారం ఒక వ్యక్తిగత అంశంపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశాడు. ముంబైలో తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మను కొందరు ఫొటోగ్రాఫర్లు ఇబ్బందికి గురి చేసిన ఘటనపై హార్దిక్ ఆవేదన వ్యక్తం చేశాడు. బాంద్రాలోని ఒక రెస్టారెంట్ సమీపంలో నడుస్తూ వెళ్తున్న మహికా శర్మను ఓ ఫొటోగ్రాఫర్ అనవసరంగా, ఆమెకు అసౌకర్యం కలిగించే కోణంలో చిత్రీకరించాడు.

Details

మహిళలను మర్యాదగా చూడటం మన ప్రాథమిక బాధ్యత

వ్యక్తిగత గోప్యతకు గౌరవం ఇవ్వకుండా సెన్సేషన్ కోసం ఇలా వ్యవహరించడం బాధాకరం. మహిళలను మర్యాదగా చూడటం మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్కరికీ హద్దులు ఉంటాయని పాండ్య పేర్కొన్నాడు. అలాగే మీడియా ప్రతినిధులు పడే కష్టాన్ని గుర్తుచేసిన హార్దిక్, వారికి గౌరవం తెలుపుతూ విజ్ఞప్తి చేశాడు. ప్రతిరోజూ కష్టపడే మీడియా సోదరులకు నా ఆభినందనలు. మీ వృత్తి పట్ల నాకు గౌరవం ఉంది. ఎప్పుడూ మీకు సహకరించేందుకు నేను సిద్ధమే. కానీ ఒక్క విషయం మాత్రమే కోరుతున్నాను. దయచేసి కాస్త విజ్ఞతతో వ్యవహరించండి. ప్రతి క్షణాన్నీ, ప్రతి కోణాన్నీ ఫొటో తీయాల్సిన అవసరం లేదు. కొంచెం మానవత్వం కూడా చూపించాలి. ధన్యవాదాలని హార్దిక్ తన సందేశంలో పేర్కొన్నాడు.

Advertisement