LOADING...
Hardik Pandya: హార్దిక్ రీ-ఎంట్రీ సూపర్.. తొలి మ్యాచ్‌లోనే దుమ్మురేపిన ఆల్‌రౌండర్
హార్దిక్ రీ-ఎంట్రీ సూపర్.. తొలి మ్యాచ్‌లోనే దుమ్మురేపిన ఆల్‌రౌండర్

Hardik Pandya: హార్దిక్ రీ-ఎంట్రీ సూపర్.. తొలి మ్యాచ్‌లోనే దుమ్మురేపిన ఆల్‌రౌండర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2025
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో బరోడా వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బరోడా, పంజాబ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 222 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని బరోడా 19.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించగలిగింది. ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్య (77*; 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు.

Details

రాణించిన పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ

బరోడా ఓపెనర్లు విష్ణు సోలంకి (43; 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), శాశ్వత్ రావత్ (31; 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభాన్ని ఇవ్వగా, వన్‌డౌన్ బ్యాటర్ శివాలిక్ వర్మ (47; 31 బంతుల్లో) విలువైన ఇన్నింగ్స్‌తో రాణించాడు. పంజాబ్ బ్యాటింగ్‌లో కెప్టెన్ అభిషేక్ శర్మ (50; 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అన్మోల్‌ప్రీత్ సింగ్ (69; 32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్ ధీర్** (39; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా జట్టుకు మంచి పరుగులు అందించారు.

Details

హార్దిక్ పాండ్యకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'

బరోడా బౌలర్లలో రాజ్ లింబానీ మూడు వికెట్లు తీసి రాణించాడు. రసిఖ్ సలామ్, హార్దిక్ పాండ్య, అతిత్ షెత్ తలో వికెట్ పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్య 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. ఆసియా కప్ సూపర్-4లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా గాయపడిన హార్దిక్, ఇటీవల ఫిట్‌నెస్ సాధించి మళ్లీ బరిలోకి దిగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా ఆడుతూ, డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.

Advertisement