Page Loader
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్‌లో రనౌట్‌ డ్రామా.. అంపైర్ల తీరుపై హర్మన్‌ప్రీత్‌ అగ్రహం 
టీ20 ప్రపంచకప్‌లో రనౌట్‌ డ్రామా.. అంపైర్ల తీరుపై హర్మన్‌ప్రీత్‌ అగ్రహం

Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్‌లో రనౌట్‌ డ్రామా.. అంపైర్ల తీరుపై హర్మన్‌ప్రీత్‌ అగ్రహం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2024
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఓ రనౌట్‌ వివాదం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. న్యూజిలాండ్‌ బ్యాటర్‌ అమేలియా కెర్‌ రనౌట్‌ వ్యవహారంలో అంపైర్ల తీరు సరిగ్గా లేదంటూ భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో మ్యాచ్‌లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ మొదటగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్‌లో, దీప్తి శర్మ బౌలింగ్‌లో, అమేలియా కెర్‌ లాంగాఫ్‌ దిశగా షాట్‌ ఆడింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బంతిని అందుకుని అమెలియాను రనౌట్‌ చేసింది. అయితే అంపైర్‌ అప్పటికే బంతిని డెడ్‌ గా ప్రకటించారు.

Details

అంపైర్ల తీరుపై జెమీమా రోడ్రిగ్స్ అసహనం

ఎందుకంటే బౌలర్ దీప్తికి క్యాప్‌ అప్పగించడం ద్వారా ఆట ముగిసినట్లు అంపైర్లు భావించారు. అమేలియా పెవిలియన్‌కి వెళ్తుండగా అంపైర్లు ఆమెను వెనక్కి పిలిచారు. హర్మన్‌ కౌర్‌ ఈ నిర్ణయంపై అంపైర్లతో వాగ్వాదానికి దిగింది. అమేలియా తిరిగి తన క్రీజ్‌లోకి వచ్చినా, అమె తరువాతి ఓవర్‌లో అవుట్‌ కావడం మ్యాచ్‌కు కొత్త మలుపు తిప్పింది. మ్యాచ్ అనంతరం జెమీమా రోడ్రిగ్స్‌ కూడా అంపైర్ల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కానీ చివరకు భారత జట్టు 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.