Page Loader
Womens T20 World Cup 2023 Semisలో భారత్ కెప్టెన్ పోరాటం వృథా
34 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన హర్మన్ ప్రీత్ సింగ్

Womens T20 World Cup 2023 Semisలో భారత్ కెప్టెన్ పోరాటం వృథా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2023
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2023 ICC మహిళల T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో అద్భుతంగా పోరాడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల చేసి సత్తా చాటింది. అయినప్పటికీ ఆస్ట్రేలియా మహిళలు విజయం సాధించడంతో ఆమె పోరాటం వృథా అయింది. భారత్‌కు విజయానికి 173 పరుగులు అవసరం కాగా, టీమిండియా 167 పరుగులను మాత్రమే చేసింది. భారత్ 28 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయినప్పుడు హర్మన్ ప్రీత్ క్రీజులోకి వచ్చింది. ఆమె నాలుగో వికెట్ కు జెమియా రోడ్రిగ్స్(43) కలిసి 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అనంతరం రిచా ఘోష్ (14)తో కలిసి మరో 40 పరుగులను జోడించింది.

హర్మన్ ప్రీత్

హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీ

హర్మన్ ప్రీత్ 34 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అర్ధ సెంచరీ చేసింది. హర్మన్‌ప్రీత్ టీ20ల్లో ప్రస్తుతం 28.05 సగటుతో 3,058 పరుగులు చేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ 20.57 సగటుతో 576 పరుగులు చేసింది. ఇందులో రెండు అర్ద సెంచరీలున్నాయి. ఆస్ట్రేలియా మహిళలపై హర్మన్‌ప్రీత్ 51.18 సగటుతో 563 పరుగులు చేసి, మూడు అర్ధ సెంచరీలను చేసింది. గ్రూప్ బిలో తొలి స్థానంలో ఉన్న ఇంగ్లండ్, గ్రూప్ ఏలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాతో రేపు తలపడనుంది. గెలిచిన జట్టు ఈనెల 26న ఆస్ట్రేలియాతో ఫైనల్‌ను ఆడనుంది.