13 ఏళ్ల వయస్సులో నిషేధం.. అయినా పతకాలు సాధిస్తూ ఆదర్శంగా నిలిచిన హర్మిలస్
భారత అథ్లెట్ హర్మిలస్ బైన్స్ ను చూడగానే మోడల్ గా కనిపిస్తుంది. ఉంగరాల జట్టుతో ఈ అమ్మాయి వస్తుంటే అందరి చూపులు ఆమె మీద ఉంటాయి. సున్నితంగా అనిపించే ఈ అమ్మాయి అథ్లెటిక్స్ ట్రాక్ మీద పతకాల పంట పండిస్తోంది. తాజాగా ఆసియా గేమ్స్ లో 1500 మీటర్ల పరుగు పందెంలో రజతం సాధించి సత్తా చాటింది. పంజాబ్ కు చెందిన హర్మిలన్ అథ్లెటిక్స్ కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లి మాధురి సింగ్, తండ్రి అమన్ దీప్ బైన్ కూడా అంతర్జాతీయ అథ్లెట్స్ కావడం విశేషం. అయితే 13 ఏళ్ల వయస్సులో స్థానికంగా ఓ వైద్యుడు ఇచ్చిన మందులు వాడడం వల్ల ఆమె నాడా పరీక్షల్లో పట్టుబడింది.
గాయం కారణంగా కామన్వెల్త్, ప్రపంచ ఛాంపియన్ షిప్ కు దూరమైన హర్మిలన్
దీంతో కుంగిపోయినా ఆమె 2015లో సెలక్షన్స్ లో సత్తా చాటి సాయ్ హాస్టల్‌లో చోటు సంపాదించుకుంది. ఇక సీబీఎస్ఈ జాతీయ అథ్లెటిక్స్ లో 1500 మీటర్ల పసిడి గెలిచి ముందుకెళ్లింది. అదే ఏడాది అండర్-18 జాతీయ ఛాంపియన్ షిప్‌లో 800 మీటర్లు, 500 మీటర్లలో రజతాలు సొంతం ఆమె సొంతం చేసుకుంది. 2021లో 800, 1500 మీటర్ల పరుగులో జాతీయ ఛాంపియన్ అయిన ఆమె ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లోనూ పసిడి పతకాలను సాధించింది. అయితే 2022 లో మోకాలి గాయం కారణంగా ఆమె కామన్వెల్త్ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్ షిప్ లాంటి టోర్నీలకు దూరమైంది. తర్వాత గాయం నుంచి కోలుకొని ఆసియా క్రీడలకు అర్హత సాధించి, హాంగ్‌జౌలో రాణించింది.