
Harry Brook : ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీపై నెలకొన్న అనిశ్చితికి తెర.. సారథిగా హ్యారీ బ్రూక్.. వన్డే, టీ20 పగ్గాలు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీపై నెలకొన్న గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది.
అందరూ అంచనా వేసినట్లుగానే, యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌ను (Harry Brook) ఈ పదవికి ఎంపిక చేశారు.
జోస్ బట్లర్ (Jos Buttler) స్థానాన్ని భర్తీ చేస్తూ 26 ఏళ్ల బ్రూక్‌కు ఈ బాధ్యతను అప్పగించినట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అధికారికంగా సోమవారం ప్రకటించింది.
ఇకపై వన్డేలు, టీ20 ఫార్మాట్లలో బ్రూక్ ఇంగ్లండ్ జట్టును నేతృత్వం వహించనున్నాడు. ఈ అవకాశాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని బ్రూక్ హర్షం వ్యక్తం చేశాడు.
వివరాలు
ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోవడం నా ప్రథమ లక్ష్యం
"ఇంగ్లండ్ వైట్ బాల్ జట్లకు కెప్టెన్‌గా ఎంపిక కావడం నాకు ఒక అద్భుత గౌరవం. చిన్ననాటి నుంచి జాతీయ జట్టులో ఆడాలన్నది నా కల. యార్క్‌షైర్ జట్టులో ఉండగా నుంచే ఇంగ్లండ్ జెర్సీ వేసుకోవాలని, కెప్టెన్‌గా మారాలని ఆశించేవాణ్ణి. ఈ రోజు ECB ఈ అవకాశాన్ని ఇవ్వడం ద్వారా నా కల నిజమైంది. నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహించిన నా కుటుంబసభ్యులకు,కోచ్‌లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.వారు నాలో పెట్టిన నమ్మకాన్ని నేను నెరవేర్చాను.కెప్టెన్‌గా జట్టును విజయాల దిశగా తీసుకెళ్లటం నా ముఖ్యమైన లక్ష్యం. ద్వైపాక్షిక సిరీస్‌లు గెలవడం, ప్రపంచ కప్ ట్రోఫీలను అందుకోవడం నా ప్రథమ లక్ష్యాల్లో ఒకటి. ఈ కొత్త సవాలును స్వీకరించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను," అని బ్రూక్ వెల్లడించాడు.
వివరాలు
వన్డే, టీ20ల్లో తన స్థాయికి తగ్గ ఆటతీరు ఆడని ఇంగ్లండ్ జట్టు
ఇటీవలి కాలంలో వన్డే, టీ20ల్లో ఇంగ్లండ్ జట్టు తన స్థాయికి తగ్గ ఆటతీరు చూపించలేకపోయింది.
2022లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జోస్ బట్లర్ నేతృత్వంలోని జట్టు, గత సంవత్సరం అదే టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయింది.
అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలోనూ నిరాశపరిచే ఆటతీరు ప్రదర్శించి, లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ పరాజయాల నేపథ్యంలో బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ECB కొత్త కెప్టెన్ ఎంపిక ప్రక్రియ ప్రారంభించగా, బ్రూక్, లివింగ్‌స్టోన్, బెన్ డకెట్ పేర్లు పరిశీలనకు వచ్చాయి.
వివరాలు
మూడు ఫార్మాట్లకు కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెక్‌కల్లమ్
బెన్ స్టోక్స్‌కు కూడా ఈ బాధ్యతలు ఇవ్వవచ్చని వార్తలు వచ్చినా, బోర్డు సభ్యులు, మాజీ క్రికెటర్లు యువ క్రీడాకారుడైన బ్రూక్‌కే ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో కలిసి బ్రూక్ జట్టును ముందుకు నడిపించనున్నాడు.
వన్డేలు, టీ20లు, టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ యువ క్రికెటర్... కెప్టెన్‌గా తన ప్రతిభ ఎలా చూపుతాడో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇంగ్లండ్ సారథిగా హ్యారీ బ్రూక్
CAPTAIN BROOK 🦜
— England Cricket (@englandcricket) April 7, 2025
Harry Brook is our new Men's ODI and IT20 captain!
Read more 👇