
ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు తరుపున హ్యారీకేన్ ఆల్‌టైమ్ రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యారికేన్ ఆల్ టైమ్ రికార్డును సృష్టించాడు. ఇటలీలో జరిగిన UEFA యూరో 2024 క్వాలిఫయర్స్‌లోని ఇంగ్లాండ్ ప్రారంభ గ్రూప్ సీ మ్యాచ్‌లో అతను అరుదైన ఫీట్ ను సాధించాడు.
హ్యారికేన్ ఇంగ్లాండ్ తరుపున 54 గోల్స్ చేసి చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు ఈ రికార్డు రూని (53) పేరిట ఉండేది. ప్రస్తుతం ఆ రికార్డును హ్యారికేన్ బ్రేక్ చేశాడు. ఇటలీని 2-1తో ఇంగ్లండ్ ఓడించిన విషయం తెలిసిందే.
కేన్ గోల్స్ మొత్తం 54 గోల్స్ చేయగా.. ఇందులో కెప్టెన్‌గా (46), పెనాల్టీల ద్వారా (18), 2021 సంవత్సరంలో ఏకంగా 16 గోల్స్ చేసి సంచలనం సృష్టించాడు. ప్రధాన టోర్నమెంట్‌లలో 12 గోల్స్ చేసి సత్తా చాటాడు.
హ్యారికేన్
విజృంభించిన హ్యారికేన్
టునైట్ పెనాల్టీతో కేన్ 16 UEFA యూరో క్వాలిఫైయింగ్‌లో ఈ రికార్డును సాధించాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో అతను 17 గోల్స్ చేశాడు. యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో కేన్ నాలుగు గోల్స్ చేశాడు. FIFA ప్రపంచ కప్‌లో ఎనిమిది గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇంగ్లాండ్ 2-1తో ఇటలీపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో డెక్లాన్ రైస్ వేగంగా స్కోర్‌ను ప్రారంభించాడు. . జాక్ గ్రీలిష్ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
అయితే హ్యారీకేన్ పెనాల్టీ ద్వారా గోల్ చేశాడు. రెండో అర్ధభాగంలో ఇంగ్లండ్ రాణించలేదు. ఇంగ్లండ్ తరఫున 80వ నిమిషంలో ల్యూక్ షా ఔటయ్యాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కంగ్రాట్యులేషన్స్ హ్యారికేన్
Congratulations to @HKane on becoming @England’s all-time leading goalscorer. I knew it wouldn’t take long but that was quick 🤣. Great man, unbelievable goalscorer and an England legend. Congrats Harry 👏👏👏 pic.twitter.com/mX7M8S8al3
— Wayne Rooney (@WayneRooney) March 23, 2023