World Cup 2023: అతడు ఫ్యూర్ మ్యాచ్ విన్నర్.. వరల్డ్ కప్ జట్టులో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది : హర్భజన్ సింగ్
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ వన్డే వరల్డ్ కప్‌లో కొందరు ఆటగాళ్లకు స్థానం లేకపోవడంపై పలువురు మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా స్పిన్నర్ యుజేంద్ర చాహల్ ను తీసుకోకపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ షింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వరల్డ్ కప్ జట్టులో చాహల్ లేకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, అతడు ప్యూర్ మ్యాచ్ విన్నర్ అని హర్భజన్ సింగ్ ఎక్స్ లో పేర్కొన్నాడు.
వన్డే ప్రపంచ కప్ కు ఎంపికైన భారత జట్టు ఇదే
స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు సెలక్షన్ కమిటీ జట్టులో చోటు కల్పించింది. దీంతో లెగ్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్ కు నిరాశ తప్పలేదు. అయితే చాహల్‌కు బ్యాటింగ్ రాకపోవడం కూడా ఓ ప్రతికూలత అని చెప్పొచ్చు. ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.