Page Loader
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా హేమంగ్ బదానీ.. ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్‌ క్రికెట్‌గా వేణుగోపాల్ రావు
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా హేమంగ్ బదానీ

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా హేమంగ్ బదానీ.. ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్‌ క్రికెట్‌గా వేణుగోపాల్ రావు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2024
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) హెడ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ బాధ్యతలు తీసుకోవడం ఖాయమైంది. అలాగే, ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్‌ క్రికెట్‌గా భారత మాజీ ఆటగాడు వేణుగోపాల్ రావును నియమించినట్లు దిల్లీ క్యాపిటల్స్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దిల్లీకి గత ఎనిమిది సంవత్సరాల పాటు హెడ్‌ కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్‌ను ఇటీవలే తొలగించిన సంగతి తెలిసిందే. గత సీజన్‌ వరకు సౌరభ్‌ గంగూలీ దిల్లీ ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్‌ క్రికెట్‌గా పనిచేశారు. ఇప్పుడు అతని స్థానంలో వేణుగోపాల్ రావు బాధ్యతలు చేపట్టనున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన ట్వీట్