
MI vs LSG: వాంఖడే వేదికగా ముంబై-లక్నో మధ్య హైవోల్టేజ్ మ్యాచ్.. టాస్ ఎవరు గెలిచారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా డబుల్ హెడ్డర్ మ్యాచులు జరుగుతున్నాయి.
రివేంజ్ వీక్ కొనసాగుతున్న నేపథ్యంలో మొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) లక్నో జట్లు (Lucknow) పోటీ పడుతున్నాయి.
వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబయి ముందుగా బ్యాటింగ్ చేయనున్నది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై, లక్నో జట్లు రెండూ 10 పాయింట్లతో వరుసగా ఐదో, ఆరవ స్థానాల్లో ఉన్నాయి.
Details
ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న ముంబై
ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా మూడో లేదా నాలుగో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
గతంలో ఈ నెల 4న జరిగిన 16వ మ్యాచ్‌లో లక్నో జట్టు ముంబయిపై 12 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఆ ఓటమికి ప్రతీకారంగా ముంబై జట్టు ఈరోజు గెలుపొందాలని భావిస్తోంది.
ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్ల ప్లేఆఫ్ ఆశలపై ప్రభావం చూపనుండటంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.
Details
ఇరు జట్లలోనే ప్లేయర్లు వీరే
ర్యాన్ రికెల్టన్ (wk), హార్దిక్ పాండ్యా (c), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్, రోహిత్ శర్మ,
లక్నో సూపర్ జెయింట్స్
రిషబ్ పంత్ (c & wk), ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, ఆయుష్ బదోని