IPL-SRH-RCB-Record Score: ఈ సీజన్ ఐపీఎల్ లో రెచ్చిపోతున్న హైదరాబాద్ జట్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఐపీఎల్ (IPL) సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ (SRH) జట్టు రెచ్చిపోయి ఆడుతోంది.
రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది.
పదకొండేళ్ల పాటు నిలిచిన ఐపీఎల్ అత్యధిక స్కోరును చెరిపేస్తూ సోమవారం ఎస్ఆర్హెచ్ రికార్డును సృష్టించింది.
సోమవారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ జట్టు తను క్రియేట్ చేసిన అత్యధిక పరుగుల రికార్డును చెరిపేసింది.
ఈ సీజన్ లో మార్చి 27న ముంబయి ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు 277 పరుగులు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
సోమవారం ఆ రికార్డును తానే చెరిపేస్తూ ఆర్సీబీ (RCB) జట్టుపై 287 పరుగులు చేసింది.
Hyderbad sun raisers team
ఎస్ ఆర్ హెచ్ జట్టుకు దడపుట్టించిన ఆర్సీబీ టీమ్
సోమవారం రాత్రి ఆర్సీబీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.
ట్రావిస్ హెడ్ కేవలం 39 బంతుల్లో నే సెంచరీ పూర్తి చేశాడు.
అగ్నికి వాయువు తోడన్నట్లు బ్యాటర్ క్లాసెన్ కూడా 31 బంతుల్లో 67 పరుగులు చేశాడు.
సమద్ 10 బంతుల్లో 37 రన్స్, మార్క్ రమ్ 17 బంతుల్లో 32 పరుగులు చేసి హైదరాబాద్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.
288 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్సింగ్స్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు కూడా ఎస్ ఆర్ హెచ్ కు ధీటైన జవాబిస్తూ పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ లు పోటీ పడి పరుగులు చేస్తూ పవర్ ప్లేలో హైదరాబాద్ జట్టుకు దడ పుట్టించారు.
RCB Vs SRH-IPL
262 పరుగులే చేసిన ఆర్సీబీ
అయితే భారీ విజయలక్ష్యం ఛేదించాల్సి రావడంతో ఒత్తిడికి లోనైన ఆర్సీబీ క్రమంగా వికెట్లు కోల్పోయింది.
అయితే ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తీక్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
చివరికి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఆర్సీబీ జట్టు 262 పరుగులు మాత్రమే చేయగలింది.