టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్
టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్ స్పందించాడు. ఫ్రాంచైసీ క్రికెట్ బాగా పెరిగిపోవడంతో అంతర్జాతీయ షెడ్యుల్ పై తీవ్ర ప్రభావం పడుతోందని స్మిత్ ఆందోళన వ్యక్తం చేశాడు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో చిన్న దేశాలు ఎక్కువగా టెస్టు మ్యాచులు ఆడలేకపోతున్నాయి. ఈ క్రమంలో దీనిపై స్మిత్ మాట్లాడారు. టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై తనకు కాస్త ఆందోళనగానే ఉందని, అయితే టెస్టు క్రికెట్ బతుకుందని ఆశిస్తున్నానని, ప్రస్తుతం ఈ ఫార్మెట్ మంచి స్థితిలో ఉందని అతను పేర్కొన్నారు. టీమిండియాతో డబ్య్లూటీసీ ఫైనల్స్ కు సిద్దమవుతున్న తరుణంలో స్మిత్ ఈ వ్యాఖ్యలను చేశాడు.
టీమిండియాపై ఎలాంటి ఒత్తిడి లేదు : రాహుల్ ద్రావిడ్
భారత్ కు నాణ్యమైన పేసర్లు, స్పిన్నర్లు ఉన్నారని, షమీ, సిరాజ్ లకు డ్యూక్ బాల్ సరైందని స్మిత్ తెలిపాడు టీమిండియాకు నాణ్యమైన బౌలింగ్ అటాక్ ఉందని కొనియాడారు. టీమిండియాపై ఎలాంటి ఒత్తిడి లేదని, పదేళ్లకు పైగా ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న మాట వాస్తవమేనని, ఆస్ట్రేలియాలో సిరీస్ విజయం, ఇంగ్లండ్ లో డ్రా ఇలా కొంత కాలంగా అద్భుతంగా పోరాడుతున్నామని, ఈ ఫైనల్ ఫలితం కారణంగా అంతకుముందు ఘనతలు మసకబారిపోవని టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నారు. డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచులో టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది. షమీ, సిరాజ్ తో పాటు శార్దుల్ ఠాకూర్ ను మూడో పేసర్ గా ఉండే అవకాశం ఉంది.