Rishabh Pant : బెంగళూరులో పంత్ షో ఉంటుందా? ఆర్సీబీపై రికార్డులివే..
ఈ వార్తాకథనం ఏంటి
రిషబ్ పంత్ ఐపీఎల్ 2026లో తన జట్టైన లక్నో సూపర్ జెయింట్స్ తరఫున కీలక పాత్ర పోషిస్తున్నాడు. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు పంత్ ప్రదర్శనపైనే నిలిచింది. రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ రెండు విజయాలు, రెండు ఓటములతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
వివరాలు
ఆ జట్టుపై పంత్‌కు మంచి రికార్డ్..
ఆర్‌సీబీపై పంత్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆ జట్టుపై 13 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన పంత్ మొత్తం 539 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 53.9గా ఉండగా, స్ట్రైక్ రేట్ 158.06గా ఉంది. ఆర్‌సీబీపై అతను ఒక సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీపై మూడు మ్యాచ్‌ల్లో 160 పరుగులు చేసిన పంత్, అక్కడ 53.33 సగటుతో బ్యాటింగ్ చేశాడు. ఈ మైదానంలో అతను రెండు అర్ధ సెంచరీలు సాధించాడు.
వివరాలు
ఐపీఎల్‌లో రికార్డులివే..
మొత్తం ఐపీఎల్ 2026 సీజన్‌లో పంత్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో 103 పరుగులు చేశాడు. అతని సగటు 34.33 కాగా, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇక మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో పంత్ 129 మ్యాచ్‌ల్లో 3,656 పరుగులు చేశాడు. అతని సగటు 34.16, స్ట్రైక్ రేట్ 147.06గా ఉంది. ఇప్పటివరకు 2 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.