Page Loader
Cricket Commentators Salary: పెద్ద మొత్తంలో సంపాదిస్తున్న భారత కామెంటేటర్‌లు..! ఒక్క మ్యాచ్​కు ఎంత సంపాదిస్తారంటే? 
ఒక్క మ్యాచ్​కు ఎంత సంపాదిస్తారంటే?

Cricket Commentators Salary: పెద్ద మొత్తంలో సంపాదిస్తున్న భారత కామెంటేటర్‌లు..! ఒక్క మ్యాచ్​కు ఎంత సంపాదిస్తారంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2024
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌కి మాటలతో మేజిక్ చేయగలిగే కామెంటరీ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. గతంలో రేడియోలో మాత్రమే వినే కామెంటరీ ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ సమయంలో కూడా క్రికెట్ ఆసక్తిని మరింత పెంచుతోంది. క్రికెట్ కామెంటరీ ఆటకు ఎమోషన్‌, ఎక్సైట్‌మెంట్‌ను ఇస్తుంది. మంచి కామెంటేటర్‌ ఆటలో ఏం జరుగుతుందో కేవలం వివరించడం మాత్రమే కాకుండా, ప్రేక్షకులకు గేమ్‌ని సులభంగా అర్థం చేసుకునేలా చేస్తాడు. ఉత్తమ కామెంటేటర్‌లు ఆటలో ఏమి జరిగినా త్వరగా స్పందిస్తారు. ఏదైనా సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. గత నాలుగు దశాబ్దాలుగా టోనీ గ్రేగ్,రిచీ బెనాడ్,రవిశాస్త్రి,హర్షా భోగ్లే వంటి కామెంటరీ దిగ్గజాలు క్రికెట్ అభిమానులకు మజా కలిగిస్తున్నారు.

వివరాలు 

భారతదేశంలో క్రికెట్ కామెంటేటర్‌ల పెరుగుదల!

వీరు ముఖ్యమైన మ్యాచ్‌లు, సిరీస్‌లు, టోర్నీల్లో తమ సేవలు అందిస్తున్నారు. అయితే వీరి ఆదాయం ఎంత ఉంటుందో మీకు తెలుసా? భారతదేశంలో క్రికెట్‌ ఒక క్రీడ మాత్రమే కాదు, మరింత అంకితభావంతో చూసే ఆట. కోట్లాది మంది దీనిని ప్రేమతో అనుసరిస్తారు. ఈ క్రికెట్ పాపులారిటీ కారణంగా బ్రాడ్‌కాస్టర్‌లకు భారీగా స్పాన్సర్‌షిప్‌లు, బ్రాండ్‌ మనీ వస్తోంది. దీని వల్ల భారతీయ క్రికెట్ కామెంటేటర్‌లు ప్రపంచంలోనే అత్యధిక సంపాదన పొందుతున్న స్పోర్ట్స్‌ కామెంటేటర్‌లుగా నిలుస్తున్నారు. ప్రముఖ హిందీ క్రికెట్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా భారత క్రికెట్ కామెంటేటర్‌ల ఆదాయ వివరాలను ఇటీవల పంచుకున్నారు.

వివరాలు 

క్రికెట్ కామెంటేటర్‌ల ఆదాయం ఎంత? 

భారతదేశంలో ఒక జూనియర్ క్రికెట్ కామెంటేటర్ రోజుకు సుమారు రూ.35,000 సంపాదించవచ్చు. అదే సమయంలో అనుభవం ఉన్న సీనియర్ కామెంటేటర్ అయితే రోజుకు రూ.6 లక్షల నుండి రూ.10 లక్షల వరకు సంపాదించవచ్చు. తమ జీతంతో పాటు, సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న కామెంటేటర్‌లు బ్రాండ్ల ప్రమోషన్‌లు, ప్రకటనల ద్వారా అదనపు ఆదాయం కూడా పొందుతారు.

వివరాలు 

ఐపీఎల్‌, భారత్ మ్యాచ్‌లకు డిమాండ్‌ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), భారతీయ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సమయంలో కామెంటేటర్‌ల ఆదాయం మరింత పెరుగుతుంది. ఈ సందర్భాల్లో ప్రముఖ కామెంటేటర్‌లు భారీ మొత్తంలో సంపాదిస్తారు. ఉదాహరణకు, హర్షా భోగ్లే 2008 నుండి ఐపీఎల్‌కి కామెంటరీ అందిస్తున్నారు. రవిశాస్త్రి కూడా 2008 నుంచి ఐపీఎల్‌ కామెంటరీ అందిస్తున్నాడు. ఆయన భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడైన తర్వాత కొంతకాలం కామెంటరీకి విరామం ఇచ్చాడు. సునీల్ గావస్కర్ కూడా మూడు దశాబ్దాలకు పైగా కామెంటరీ అందిస్తున్నారు. IPL ప్రారంభం నుండి ఆయన కామెంటరీ టీమ్‌లో ఉన్నారు.