Page Loader
IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా?
ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా?

IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జూన్ 3న జరిగే ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఈ రెండు జట్లు తమ తొలి ఛాంపియన్ ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఆర్సీబీ ఇప్పటికే క్వాలిఫయర్-1లో పంజాబ్‌ను ఓడించి నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించింది. మరోవైపు పంజాబ్, ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించి, తర్వాత క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్ చేరుకుంది. దీంతో ఈ సారి ఎవరు తొలి టైటిల్ గెలుస్తారు అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

Details

 విజేతకు రూ.20 కోట్లు, రన్నరప్‌కు రూ.13 కోట్లు

IPL గెలిచిన జట్టుకు రూ.20 కోట్లు ప్రైజ్ మనీ లభించనుండగా, రన్నరప్ జట్టుకు రూ.13 కోట్లు లభించనున్నాయి. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఆర్సీబీ టైటిల్‌తో పాటు ఈ భారీ బహుమతిని గెలుచుకోవాలని చూస్తోంది. పంజాబ్ కింగ్స్‌ కెప్టెన్ కూడా రూ.20 కోట్ల గ్రాండ్ బహుమతిపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. 2025 సీజన్ ప్రైజ్ మొత్తం వివరాలు ఈ సీజన్‌లో మొత్తం ప్రైజ్ పూల్ రూ.46.5 కోట్లు. గెలిచిన జట్టుకు రూ.20 కోట్లు, రెండో స్థానానికి రూ.13 కోట్లు, మూడో స్థానానికి రూ.7 కోట్లు, నాలుగో స్థానానికి రూ.6.5 కోట్లు లభించనున్నాయి.

Details

సీజన్‌లో అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లకు వ్యక్తిగత అవార్డులు

ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు): రూ.10 లక్షలు పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు): రూ.10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: రూ.20 లక్షలు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్: రూ.10 లక్షలు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: రూ. 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: రూ. 10 లక్షలు మోస్ట్ సిక్స్‌లు కొట్టిన ఆటగాడు: రూ. 10 లక్షలు గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్: రూ.10 లక్షలు

Details

ఐపీఎల్ ప్రైజ్ మనీ - ఏడాది వారీగా ఎదుగుదల

2008-09: విజేతకు రూ.4.8 కోట్లు, రన్నరప్‌కు రూ.2.4 కోట్లు 2010-13: విజేతకు రూ.10 కోట్లు, రన్నరప్‌కు రూ.5 కోట్లు 2014-15: విజేతకు రూ.15 కోట్లు, రన్నరప్‌కు రూ.10 కోట్లు 2016-17: విజేతకు రూ.16 కోట్లు, తర్వాత తగ్గించి రూ. 15 కోట్లు 2018-19: రూ.20 కోట్లు బహుమతి స్థిరపరిచారు 2020: కోవిడ్ వల్ల రూ.10 కోట్లు (విజేత), రూ.6.25 కోట్లు (రన్నరప్) 2021: మళ్లీ రూ.20 కోట్లు (విజేత) రూ.12.2 కోట్లు (రన్నరప్) 2022-2025: స్థిరంగా రూ.20 కోట్లు (విజేత), రూ.13 కోట్లు (రన్నరప్)

Details

ఫ్రాంచైజీలు ఆదాయం ఎలా పొందుతాయి?

ఐపీఎల్ జట్లు కేవలం ప్రైజ్ మనీ మాత్రమే కాదు, వివిధ మార్గాల్లో ఆదాయాన్ని సంపాదిస్తాయి: 1. బీసీసీఐ నుంచి కేంద్ర ఆదాయం: మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో 45% వాటా అన్ని జట్లకూ సమానంగా లభిస్తుంది. ఇది ఒక్కో జట్టుకు రూ. 400 కోట్లు దాటే అవకాశం. 2. స్వంత స్పాన్సర్‌షిప్ డీల్స్ జెర్సీలు, కీప్, క్యాప్‌లపై లోగోలు ద్వారా రూ.70-100 కోట్లు వరకు జట్లు సంపాదిస్తాయి. 3. టికెట్ అమ్మకాలు హోం మ్యాచుల ద్వారా టికెట్ల విక్రయాల ద్వారా మంచి ఆదాయం.

Details

4. బ్రాండ్ విలువ

బలమైన బ్రాండ్ జట్టుకు పెట్టుబడులు, స్పాన్సర్‌లు ఆకర్షణకు దోహదం చేస్తుంది. ఐపీఎల్ కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు, అది ఒక భారీ వాణిజ్య సామ్రాజ్యం. జట్లు ప్రైజ్ మనీతో పాటు వివిధ ఆదాయ మార్గాల ద్వారా వేల కోట్ల లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇది లీగ్ స్థిరత్వాన్ని పెంచి, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది.