Page Loader
World Cup 2023 Qualifiers: నేపాల్‌పై వెస్టిండీస్ భారీ విజయం
సెంచరీతో చెలరేగిన కెప్టెన్ షాయ్ హోప్

World Cup 2023 Qualifiers: నేపాల్‌పై వెస్టిండీస్ భారీ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2023
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన మ్యాచులో నేపాల్ జట్టుపై వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ 129 బంతుల్లో (10 ఫోర్లు, 3 సిక్సర్లు) 132 పరుగులు చేయగా, నికోలస్ పూర్ పూరన్ 94 బంతుల్లో ( 10 ఫోర్లు 4 సిక్సర్లు) 115 పరుగులు చేశారు. వీరిద్దరూ సెంచరీలు చెలరేగడంతో వెస్టిండీస్ జట్టు నేపాల్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నేపాల్ బౌలర్లలో రాజ్ బిన్షి 3 వికెట్లతో ఫర్వాలేదనిపించాడు.

Details

వెస్టిండీస్ కెప్టెన్ హోప్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

అనంతరం 340 పరుగుల భారీ స్కరును చేధించేందుకు బరిలోకి దిగిన నేపాల్ జట్టు 49.4 ఓవర్లో 238 పరుగులకు ఆలౌటైంది. ఆరీష్ షేక్ 93 బంతుల్లో (4ఫోర్లు, 1 సిక్సర్) 63 పరుగులు చేసి జట్టు తరుపున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇక రోహిత్ పాడెల్ (30), దీపేంద్ర ఐర్ (23), కరణ్ కెసి 28 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో నేపాల్ జట్టు ఓటమిపాలైంది. వెస్టిండీస్ బౌలర్లలో హోల్డర్ 3 వికెట్లు, అల్జారీ జోసెఫ్ 2 వికెట్లతో రాణించారు. అద్భుత సెంచరీతో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హోప్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.