డబ్ల్యూటీసీ ఫైనల్లో హైదరాబాద్ కుర్రాడు రికార్డు.. అభినందించిన బీసీసీఐ
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఖవాజ్ ను ఔట్ చేసిన సిరాజ్.. రెండో హేడ్ ను ఔట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. తర్వాత టాయిలెండ్లర్లను పెవిలియన్ కు చేర్చి ఆస్ట్రేలియాను 469 పరుగులకు పరిమితం చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసిన సిరాజ్ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 50 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డుకెక్కాడు. ఈ రికార్డు సాధించిన 42 బౌలర్ గా రికార్డు సాధించాడు. ఈ సందర్భంగా బీసీసీఐ సిరాజ్ ను అభినందిస్తూ ట్విట్ చేసింది.
4 వికెట్లతో చెలరేగిన మహ్మద్ సిరాజ్
2020 డిసెంబర్‌లో మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా తో జరిగిన టెస్టు మ్యాచ్ లో సిరాజ్ అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకూ 19 టెస్టులు మ్యాచులాడిన సిరాజ్.. 51 వికెట్లను పడగొట్టాడు. తొలి టెస్టులోనే అప్పట్లో ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. సిరాజ్ కు టెస్టుల్లో విదేశాల్లోనే మంచి రికార్డు ఉండడం విశేషం. ఇప్పటివరకూ తీసిన 50 వికెట్లలో 41 వికెట్లు విదేశాల్లోనే తీశాడు. గబ్బా టెస్టులో ఐదు వికెట్ల హాల్ సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా తరుపున సిరాజ్ 4 వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, షమీ చెరో రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఓ వికెట్ తీశాడు.