దవడ పగిలినా వికెట్ తీశానని నా భార్యకు ఫోన్ చేశా.. తాను నమ్మలేదు : అనిల్ కుంబ్లే
భారత్- వెస్టిండీస్ జట్ల నుంచి నేటి నుంచి డొమినికా వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్లు సుదీర్ఘ ఫార్మాట్ గా పిలవబడుతున్న టెస్టు క్రికెట్‌లో వంద టెస్టులు ఆడాయి. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కు వెస్టిండీస్ తో మ్యాచ్ అంటే చాలు ఇక పూనకాలే అని చెప్పొచ్చు. 1990లో ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ ద్వారా కుంబ్లే అంతర్జాతీయ అరంగ్రేటం చేశారు. టీమిండియా స్టార్ స్పిన్నర్లలో కుంబ్లే ఒకరు. ముఖ్యంగా 2002లో భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు దవడ పగిలి రక్తం కారినా, తలకు కట్టు కట్టుకొని మరీ కుంబ్లే బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే.
టీమిండియా తరుపున 132 టెస్టులాడిన కుంబ్లే
ప్రస్తుతం ఆ ఘటనపై తాజాగా కుంబ్లే స్పందించాడు. ఈ ఘటనపై అప్పుడు తన భార్యకు ఫోన్ చేసి తాను ఇంటికొస్తున్నానని, బెంగళూరులో సర్జరీకి సంబంధించిన విషయాలన్నీ చూసుకోవాలని చెబితే తాను జోక్ అనుకొని నమ్మలేదని కుంబ్లే వివరించారు. ఆ మ్యాచులో దెబ్బ తగిలినా కూడా కట్టు కట్టుకొని 14 ఓవర్లు బౌలింగ్ చేసి బ్రియాన్ లార్ ను ఔట్ చేశాడు. నాడు కుంబ్లే చేసిన పోరాటం టీమిండియా అభిమానుల ఇప్పటికీ మరిచిపోలేకపోవడం విశేషం. ఇప్పటివరకూ భారత్ తరుపున 132 టెస్టులాడిన అతను 619 వికెట్లు పడగొట్టాడు.