LOADING...
Rahul Dravid: 2011 ఇంగ్లండ్‌ టూర్‌లో చేసిన పొరపాటు మరిచిపోలేను : రాహుల్ ద్రవిడ్
2011 ఇంగ్లండ్‌ టూర్‌లో చేసిన పొరపాటు మరిచిపోలేను : రాహుల్ ద్రవిడ్

Rahul Dravid: 2011 ఇంగ్లండ్‌ టూర్‌లో చేసిన పొరపాటు మరిచిపోలేను : రాహుల్ ద్రవిడ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాహుల్ ద్రావిడ్ - సచిన్‌ తెందూల్కర్‌ జోడీ టెస్టుల్లో ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలు నమోదు చేసింది. సచిన్‌ను బౌలర్లు రెచ్చగొట్టి పెవిలియన్‌కు పంపించగలిగినా, ద్రవిడ్‌ ముందు మాత్రం వారికి లెక్కలు సరిపోవు. తనంతటతానే తప్పిదం చేస్తే తప్ప ద్రవిడ్‌ను ఔట్ చేయడం ప్రతిభావంతుడైన బౌలర్‌కైనా కష్టమే. ద్రవిడ్‌ ఎదుర్కొన్నప్పుడు ప్రత్యర్థులే అలసిపోవాల్సి వచ్చేది. అందుకే ఆయనను అభిమానులు ప్రేమతో 'ది వాల్‌' అని పిలిచారు. అయితే తన కెరీర్‌లో చేసిన ఒక తప్పును ఇప్పటికీ మరచిపోలేనని, ఆ సమయంలో సచిన్ ఇచ్చిన సలహాను పట్టించుకోలేదని ద్రవిడ్ గుర్తుచేసుకున్నాడు. ముఖ్యంగా 2011లో ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా ఆ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని రవిచంద్రన్ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో ద్రవిడ్‌ పంచుకున్నాడు.

Details

డీఆర్ఎస్ ను వాడుకోలేదు

'నా కెరీర్‌లో డీఆర్‌ఎస్‌ (DRS) సరిగా వాడుకోలేదని ఇప్పటికీ పశ్చాత్తాపపడుతుంటాను. 2011లో మేం ఇంగ్లాండ్‌ పర్యటనలో ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు ఆడుతున్నాం. అప్పుడు జేమ్స్ అండర్సన్ బంతిని ఆడా. ఏదో శబ్దం వినిపించింది. కానీ అది బ్యాట్‌ను తాకలేదని నేను భావించా. బ్యాటర్‌కి అలాంటి అనుభవం రావడం సహజం. బయట నుంచి కూడా బాగా శబ్దం వస్తోంది. అందుకే పెద్దగా పట్టించుకోలేదు. అంపైర్‌ సైమన్ టౌఫెల్ నన్ను ఔట్‌గా ఇచ్చాడు. వెంటనే సచిన్‌ వద్దకు వెళ్లి అడిగా. సైమన్‌ మంచి అంపైర్‌ కావడంతో అతడు పొరబాటుకు గురి కాలేదనుకున్నా. కానీ సచిన్ మాత్రం 'బంతిని తాకావు, శబ్దం వచ్చిందన్నాడు.

Details

సిరీస్ చేజారినా ద్రవిడ్ ఆట ఆద్బుతం

నాకు మాత్రం అలాంటి భావన రాలేదు. చివరికి డీఆర్‌ఎస్‌ తీసుకోకుండా నేరుగా డగౌట్‌కి వెళ్లిపోయా. అయితే తర్వాత రీప్లేలో చూసినప్పుడు బంతి వికెట్లకు దూరంగా వెళ్ళింది. ఆ శబ్దం నా షూలేస్‌కి బ్యాట్ తగలడంతో వచ్చిందని తెలిసిందని ద్రవిడ్‌ వివరించాడు. ఆ సిరీస్‌లో భారత్‌ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఆడింది. జట్టుగా విజయం సాధించకపోయినా, ద్రవిడ్‌ వ్యక్తిగత ప్రదర్శన మాత్రం అద్భుతమైంది. మూడు శతకాలు బాదిన ఆయన మొత్తం 461 పరుగులు సాధించాడు. సిరీస్‌ భారత్‌కు చేజారినా, ద్రవిడ్‌ ఆటతీరు మాత్రం అభిమానులను, క్రికెట్‌ ప్రపంచాన్ని ఆకట్టుకుంది.