తదుపరి వార్తా కథనం

Shikhar Dhawan: పేరు చెప్పలేను.. కానీ అత్యంత అందమైన అమ్మాయి అమే : శిఖర్ ధావన్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 03, 2025
10:49 am
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కొత్త రిలేషన్‌షిప్‌లో ఉన్నాడా? అనే ప్రశ్నకు సమాధానం అతని మాటల్లో దొరికినట్టే ఉంది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఆయన స్నేహితురాలు ఎవరో ప్రశ్నించగా, ధావన్ "నేను పేరు చెప్పను, కానీ నా ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి మాత్రం ఆమేనని సమాధానం ఇచ్చాడు.
మళ్లీ వార్తల్లోకి సోఫీ షైన్
ధావన్ ఈ ప్రకటన చేయగానే, సోషల్ మీడియాలో పాత వీడియోలు తిరిగి వైరల్‌గా మారాయి.
ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఓ యువతితో కలిసి మ్యాచ్ వీక్షిస్తున్న వీడియోలు మళ్లీ బయటకొచ్చాయి.
ఈ యువతి ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ అనే ప్రచారం కూడా మొదలైంది.
Details
పేరును వెల్లడించని ధావన్
ధావన్ తన గర్ల్‌ఫ్రెండ్ పేరు బయటపెట్టకపోయినా, తన మాటలతో పరోక్షంగా ధ్రువీకరించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఆమె సోఫీ షైన్‌నేనా? అనే చర్చ సోషల్ మీడియాలో మళ్లీ ఊపందుకుంది.