Page Loader
Jasprit Bumrah: సోషల్ మీడియాలో వచ్చే వాటిని పట్టించుకోను.. విజయమే నా లక్ష్యం : జస్ప్రిత్ బుమ్రా
సోషల్ మీడియాలో వచ్చే వాటిని పట్టించుకోను.. విజయమే నా లక్ష్యం : జస్ప్రిత్ బుమ్రా

Jasprit Bumrah: సోషల్ మీడియాలో వచ్చే వాటిని పట్టించుకోను.. విజయమే నా లక్ష్యం : జస్ప్రిత్ బుమ్రా

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2023
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-పాక్ (IND-PAK) క్రికెట్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం అహ్మదాబాద్ వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాయి. ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని ఇరుజట్లు తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాజీ కోచ్ సంజయ్ బంగర్‌తో టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా (Jasprit Bumrah) ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన సన్నద్ధత ఎలా ఉందో దానిపైన మాత్రమే దృష్టి సారిస్తానని, పిచ్‌ను సరిగా అంచనా వేసి దానికి తగ్గట్టుగా సిద్ధం కావాల్సిన అవసరం ఉందని, అదే తాను పాటించే సింపుల్ సూత్రమని బుమ్రా చెప్పాడు.

Details

పాకిస్థాన్ తో మ్యాచుకు సిద్ధం: బుమ్రా

ఇక పాకిస్థాన్‌తో కీలక పోరుకు సిద్ధమవుతున్నామని, బయట ఏం జరుగుతుందో తనకు తెలియదని బుమ్రా పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని అసలు పట్టించుకోనని, మ్యాచ్ పై దృష్టి పెట్టి తన శక్తిసామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు శ్రమిస్తానని, మ్యాచులో విజయం సాధించడమే తన లక్ష్యమని వెల్లడించారు. ఆసీస్ పై రెండు వికెట్లు తీసిన బుమ్రా, ఆఫ్గాన్ పై నాలుగు కీలక వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక పాకిస్థాన్ మ్యాచులో బుమ్రా ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. ఈ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచుల్లోనూ భారత్ ఘన విజయం సాధించింది.