Sunil Gavaskar: నన్ను పిలిచి ఉంటే మరింత ఆనందించేవాడిని
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాకు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ అందించేటప్పుడు వేదికపై తనను కూడా పిలిచి ఉంటే బాగుండేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
విజేతగా ఆస్ట్రేలియా ట్రోఫీ గెలుచుకుందని, ట్రోఫీ ప్రదాన సమయంలో తన స్నేహితుడు బోర్డర్‌తో కలిసి వేదికపై ఉంటే ఇంకా ఎక్కువ ఆనందించేవాడిని చెప్పారు.
చివరికి ఈ సిరీస్ తమ ఇద్దరి పేర్లతోనే జరుగుతోందని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ వ్యాఖ్యలపై స్పందించింది.
సిడ్నీ టెస్టులో భారత్ గెలిచి ట్రోఫీ తిరిగి సాధించినప్పుడు గావస్కర్‌ను వేదికపైకి పిలవడానికి ప్లాన్ చేసుకున్నామని, కానీ ఈ సారి ఆస్ట్రేలియా విజయం సాధించిందన్నారు.
ఇలాంటి సందర్భాల్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ట్రోఫీ అందజేత జరుగుతుందని స్పష్టం చేసింది.
Details
రంజీ ట్రోఫీ కీలకం
భారత బ్యాటర్లకు సాంకేతిక లోపాలను సరిదిద్దుకోవడంలో రంజీ ట్రోఫీ కీలకమని సునీల్ గావస్కర్ పునరుద్ఘాటించాడు.
రంజీ ట్రోఫీలో ఆడటం ద్వారా ఆటగాళ్ల ఆట తీరు మెరుగుపడుతుందన్నారు. అందుకే సాకులు చెప్పకుండా దేశవాళీ క్రికెట్లో పాల్గొనాలన్నారు.
రంజీ ట్రోఫీకి అందుబాటులో లేని ఆటగాళ్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం అనివార్యమని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
సొంతగడ్డపై కివీస్ చేతిలో 0-3 తేడాతో, ఆస్ట్రేలియాతో 1-3 తేడాతో సిరీస్ కోల్పోవడం ఆందోళన కలిగిస్తోందని గావస్కర్ తెలిపారు.
డబ్ల్యూటీసీ కోసం ఆటగాళ్ల సమష్టి మెరుగుదల అవసరమని, దీనికోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడమే మంచిదే అని గావస్కర్ సూచించాడు.