Page Loader
నేను ఇండియాకు ఆడి ఉంటే 1000వికెట్లు తీసేవాడిని; పాక్ మాజీ బౌలర్ బోల్డ్ కామెంట్స్ 
ఇండియా తరపున ఆడి ఉంటే వెయ్యి వికెట్లు తీసేవాడిని అంటున్న సయీద్ అజ్మల్

నేను ఇండియాకు ఆడి ఉంటే 1000వికెట్లు తీసేవాడిని; పాక్ మాజీ బౌలర్ బోల్డ్ కామెంట్స్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 02, 2023
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు సయీద్ అజ్మల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ తరపున 212 మ్యాచులు ఆడిన ఆజ్మల్, 448వికెట్లు తీసుకున్నాడు. ప్రతీ మ్యాచులో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన అజ్మల్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నియమాల ప్రకారం అతని బౌలింగ్ యాక్షన్ లేనందున అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించింది. తాజాగా ఈ విషయాలపై మాట్లాడిన అజ్మల్, సీరియస్ కామెంట్స్ చేశాడు. బౌలింగ్ అనుమానం ఉంటే 2009లో తన కెరీర్ తొలి‌నాళ్లలోనే నిషేధం విధించాల్సిందని, కానీ 448 వికెట్లు తీసిన తర్వాత వాళ్లకు ఒక కారణం దొరికిందని అజ్మల్ అన్నాడు.

Details

ఇండియా బౌలర్ల యాక్షన్ లో లోపాలు 

తాను ఒకవేళ ఇండియా తరపున ఆడి ఉంటే ఇప్పటివరకు 1000 వికెట్లు తీసి ఉండేవాడినని, తనపై నిషేధం విధించే సమయానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నానని అజ్మల్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఇండియాలో చాలామంది బౌలర్ల యాక్షన్‌లో కొంత లోపాలు ఉన్నాయని అయినా కూడా వాళ్ల కెరీర్ సాఫీగా కొనసాగుతుందని, ఐసీసీతో ఇండియాకు ఉన్న అనుబంధం వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పుకొచ్చాడు. ఒకవేళ తాను ఇండియాకి ఆడి ఉంటే ఇప్పటి వరకు వెయ్యి వికెట్లు తీసి ఉండేవాడినని ఆజ్మల్ అన్నాడు. బౌలింగ్ వేసేటప్పుడు చేతిలోంచి బాంతి వదిలి వేయబడుతున్న సమయంలో 15డిగ్రీలు వంగాల్సిన మోచేయి భాగం అంతకంటే ఎక్కువగా వంగుతుండడంతో అజ్మల్ పై ఐసీసీ నిషేధం విధించింది.