ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్ అంటూ ఆస్ట్రేలియాకు కితాబిచ్చిన ఐసీసీ
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ప్రస్తుతం టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే విధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో విజేతగా నిలవడం ద్వారా మూడు ఫార్మాట్లలో ఐసీసీ టైటిల్స్ గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. అయితే మూడు ఫార్మాట్లలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్ లు మూడు ఫార్మాట్లో ఐసీసీ టైటిల్స్ సాధించారు.
అరుదైన ఘనత సాధించిన ఐదుగురు ఆస్ట్రేలియా ప్లేయర్లు
వన్డే వరల్డ్ కప్, పొట్టి ప్రపంచ కప్, టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచిన జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ సభ్యులు కావడం విశేషం. తాజాగా వీళ్లు మూడు ట్రోఫీలు పట్టుకొని ఉన్న ఫోటోను ఐసీసీ తాజాగా ట్విట్టర్‌లో షేర్ చేసింది. దానికి అన్ని ఫార్మాట్లో సూపర్ స్టార్స్ అంటూ కితాబు ఇచ్చింది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా జట్టు 9 ఐసీసీ ట్రోఫీలున్నాయి. 1987, 1999, 2003, 2007, 2015లో వన్డే వరల్డ్ కప్, 2021లో టీ20 ప్రపంచకప్, 2006, 2009లో ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.