Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్.. భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విజయవంతంగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను అంగీకరించించింది. హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీ జరపాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీతో డిసెంబర్ 14న అధికారిక ప్రకటన వెలువడనుంది. ఐసీసీ చైర్మన్ జై షా బ్రిస్బేన్ నుంచి వర్చువల్ ద్వారా ఈ ప్రకటనలో పాల్గొననున్నారు. 2025లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి.
హైబ్రిడ్ మోడల్‌లోనే మ్యాచులు
ఇక ఈ నిర్ణయంతో ఇకపై అన్ని ఐసీసీ టోర్నీలు హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు తుది నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనదని, వారి మ్యాచ్‌లు మరో దేశంలో నిర్వహిస్తామని ఐసీసీ తెలిపింది. అలాగే 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టీ20 ప్రపంచకప్ కూడా హైబ్రిడ్ మోడల్‌లోనే జరగనుంది.