Pakistan: ఐసీసీ ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ సాధించిన రికార్డులివే!
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శతో ఇంటిదారి పట్టింది. ఇక ఆక్టోబర్ 5న భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు సత్తా చాటాలని భావిస్తోంది. మొదటి మ్యాచులో అక్టోబర్ 6న పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో తలపడనుంది. 1992 వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడిన పాకిస్థాన్, ఎలాగైనా రెండోసారి విజేతగా నిలవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టు సాధించిన విజయాలపై ఓ లుక్కేద్దాం. 1992లో ఇంగ్లండ్‌ను 22 పరుగుల తేడాతో ఓడించి పాకిస్థాన్ తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
వన్డే ప్రపంచ కప్ లో నాలుగుసార్లు సెమీస్ కు చేరిన పాకిస్థాన్
1999లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన పాకిస్థాన్, ఆస్ట్రేలియాతో జరిగిన జరిగిన మ్యాచులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ నాలుగుసార్లు (1979, 1983, 1987, 2011)లో సెమీస్‌కు చేరగా, రెండుసార్లు (1996, 2015) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక నాలుగు సార్లు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ESPNcricinfo ప్రకారం, 1975 నుండి 2019 వరకు, పాకిస్థాన్ 79 ప్రపంచ కప్ మ్యాచ్‌లను ఆడింది. ఇందులో 45 మ్యాచుల్లో విజయం సాధించగా, మిగిలిన 32 మ్యాచుల్లో ఓడిపోయింది. ఇక స్వదేశంలో జరిగిన 12 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో పాకిస్తాన్ తొమ్మిది మ్యాచుల్లో విజయం సాధించింది. మిగిలిన మూడు మ్యాచుల్లో ఓటమిపాలైంది.
2007లో అత్యల్ప స్కోరును నమోదు చేసిన పాక్
ఆసియాలో 21 ప్రపంచకప్ మ్యాచులను ఆడగా, పాకిస్తాన్ 15 విజయాలు, ఆరు ఓటములను చవిచూసింది. 2007 వన్డే ప్రపంచ కప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అత్యధికంగా 349/10 స్కోరును నమోదు చేసింది. ఎనిమిది సార్లు పాకిస్థాన్ 300 కంటే ఎక్కువ పరుగులు చేసింది. 1992 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అత్యల్పంగా 74 పరుగులు చేసి ఆలౌటైంది. నాటింగ్‌హామ్ (2019)లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో కూడా 105 పరుగులకే ఆలౌటైంది.
పాకిస్థాన్ తరుఫున అత్యధిక వికెట్ల తీసిన జావేద్ మియాందాద్
పాకిస్థాన్ తరుపున జావేద్ మియాందాద్ ప్రపంచ కప్ మ్యాచుల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. 43.32 సగటుతో 1,083 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలను బాదాడు. సయీద్ అన్వర్ (915), ఇంజమామ్-ఉల్-హక్ (717), రమీజ్ రాజా 700కు పైగా పరుగులు చేసి తర్వాతి స్థానంలో నిలిచారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 67.71 సగటుతో 474 పరుగులు చేశాడు. వసీం అక్రమ్ ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన పాకిస్థాన్ బౌలర్‌గా (55) నిలిచాడు. 50 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. వాహబ్ రియాజ్, ఇమ్రాన్ ఖాన్ 34 వికెట్లతో తర్వాతి స్థానంలో నిలిచారు. స్పిన్నర్లలో షాహిద్ అఫ్రిది 27.70 సగటుతో 30 వికెట్లను పడగొట్టాడు.