ప్రపంచకప్ పిచ్‌లపై ఐసీసీ స్పెషల్ ఫోకస్.. పచ్చిక పెంచాలంటూ క్యూరెటర్లకు మార్గదర్శకాలు జారీE
ప్రపంచకప్-2023, అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతదేశంలోని పిచ్‌లపై ఐసీసీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పిచ్‌లపై పచ్చికను పెంచాలని, బౌండరీ దూరాన్ని మరో ఐదు మీటర్లు పెంచాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో 70 మీటర్లుగా బౌండరీ ఉంటుందని స్పష్టం చేసింది. భారత్ సహా ఇతర ఆసియా దేశాల పిచ్‌లు స్పిన్నర్లకే అనుకూలంగా ఉంటాయన్న వాదన ఉంది. ఈ మేరకు అక్టోబర్, నవంబర్‌లలో శీతాకాలం కనుక మంచు ప్రభావం ఎక్కువ. ఈ నేపథ్యంలో స్పిన్నర్లు కీలకంగా మారననున్నట్లు ఇప్పటికే మాజీ క్రికెటర్లు, నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. టాస్ కీలకంగా మారనుందని, ఛేజింగ్ చేసే జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు.