Page Loader
ప్రపంచకప్ ముంగిట టీమిండియాకు గంభీర్ సలహాలు, సూచనలు
టీమిండియాకు గంభీర్ సలహాలు, సూచనలు

ప్రపంచకప్ ముంగిట టీమిండియాకు గంభీర్ సలహాలు, సూచనలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 19, 2023
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాపై భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రపంచ కప్ లోగా లోయర్ ఆర్డర్ మరింత సరిదిద్దుకోవాలని సూచించారు. తాజాగా ఆసియా కప్‌ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత జట్టు, ప్రస్తుంత కంగారులతో వన్డే సిరీస్‌ ఆడేందుకు ఎదురుచూస్తోంది. మరోవైపు అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే స్టార్ ఓపెనర్ బ్యాటర్ గంభీర్ కీలక సూచనలు అందించారు. ప్రస్తుతం టీమిండియా లోయర్‌ ఆర్డర్‌ ఇంకా బలపడాల్సి ఉందన్నారు. ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా, హార్డిక్ పాండ్యా లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తుంటారని గుర్తు చేశారు. అయితే మెగాటోర్నీ వరల్డ్ కప్‌లో ఈ ఆర్డరే కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

DETAILS  

కీలకంగా మారనున్న ఫేసర్ బుమ్రా

భారత ఓపెనర్లు గట్టి పునాధి వేస్తే చివరి పవర్‌ ప్లేలో ఆల్‌ రౌండర్‌లు బంతిని బలంగా బదుతారన్నారు. బ్యాటింగ్‌ లైనప్ లో ఈ మేరకు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కీలకంగా మారుతారని చెప్పారు. ఇందుకోసం ఆల్‌ రౌండర్లు మరింత పటిష్టం కావాలని గంభీర్‌ కోరారు. చివరి 10 ఓవర్లలో బ్యాటింగ్‌ చేసే వారు 100 పరుగులే లక్ష్యంగా బ్యాటుకు పనిచెప్పాలన్నారు. కేఎల్‌ రాహుల్, రోహిత్, శుభ్‌మన్‌లు మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసివస్తుందన్నారు. స్వదేశంలోనే ప్రపంచకప్ జరుగుతున్నా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ పేసర్లను ఎదుర్కోవడం సవాల్ అన్నారు. వారి బౌలింగ్‌ అటాక్ 140 కి.మీపైగానే ఉంటుందని, అందుకు తగ్గట్లుగా రెఢీగా ఉండాలని చెప్పారు. బుమ్రా జట్టుకు కీలకంగా మారనున్నాడని వివరించారు.