భారత్‌లో ప్రపంచకప్-2023.. ఆరంభ వేడుకలు ఎక్కడో తెలుసా?
ఐసీసీ వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి మొదలుకానుంది. ఈ మేరకు వరల్డ్ కప్ ఆరంభ వేడుకలను అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. ఇందుకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఓ వైపు వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టికెట్ల అమ్మకాలతో దేశమంతా సందడి నెలకొంది. ప్రపంచ కప్ మహాసంగ్రామం కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత భారతగడ్డపై జరగనున్న వరల్డ్ కప్ ఆరంభ వేడుకల్ని అట్టహాసంగా జరిపేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ప్రపంచకప్ ఓపెనింగ్, ఫైనల్ మ్యాచ్‌లు ఈ స్టేడియంలోనే జరగనున్నాయి.
ఇదే స్టేడియంలో అక్టోబర్ 10న భారత్- పాక్ మ్యాచ్
ప్రపంచ కప్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని కన్నుల విందుగా నిర్వహించేందుకు బీసీసీఐ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇటు సెలబ్రిటీ సింగర్ల ప్రదర్శనలతో నరేంద్ర మోదీ స్టేడియం మోగిపోనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఐసీసీ బృందం, ప్రపంచ క్రికెట్ నియంత్రణ సభ్యులు, బీసీసీఐ పెద్దలు హాజరు కానున్నారు. మరోవైపు 'కెప్టెన్స్ డే' పేరుతో ఓ ఈవెంట్ ను సైతం నిర్వహించనున్నారు. ఇందులో 10 జట్ల కెప్టెన్లు పాల్గొంటారని సమాచారం.ఈ నేపథ్యంలోనే ఐసీసీ కార్యావర్గం వీరికి ప్రపంచకప్ పోటీల తీరు తెన్నుల గురించి వివరించనున్నారు. అక్టోబర్ 5న ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తో ఇంగ్లండ్ జట్టు తలపడనుంది. అయితే అక్టోబర్ 14న ఇదే వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుండటం విశేషం.