
క్రికెట్ అభిమానులకు సూపర్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్ల బుకింగ్ ఆ రోజు నుంచే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ 2023కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఐసీసీ వార్మప్ మ్యాచుల షెడ్యూల్‌ను బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 మధ్య అన్ని జట్లు రెండేసి మ్యాచులు ఆడనున్నాయి.
ఈ మ్యాచులు హైదరాబాద్, తిరువనంతపురం, గువహటి నగరాల్లో జరగనున్నాయి. ఇక వరల్డ్ కోసం బుక్ మై షో ను తమ టికెటింగ్ భాగస్వామిగా బీసీసీఐ వెల్లడించింది.
ప్రధాన మ్యాచులు, వామప్ మ్యాచులతో సహా మొత్తం 58 మ్యాచుల టికెట్లను బుక్ మై షో ద్వారా కొనుగోలు చేసే అవకాశముంది.
ఈ టికెట్లు ఈనెల 25 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
Details
తొలి వార్మప్ మ్యాచులో ఇంగ్లండ్ తో తలపడనున్న టీమిండియా
టీమిండియా తొలి వార్మప్ మ్యాచులో సెప్టెంబర్ 30న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తో తలపడనుంది.
అయితే బోర్డు స్పాన్సర్లతో ఒకరైన 'మాస్టర్ కార్డ్' వినియోగదారులకు మాత్రం ఒక రోజు ముందుగానే టికెట్లు లభించనున్నాయి. నేటి సాయంత్రం 6 గంటల నుంచి, 29న సాయంత్రం 6 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ఇక టీమిండియా టీమిండియా ఆడే ప్రధాన మ్యాచుల టికెట్లను నాలుగు ధపాలుగా విడుదల చేయనున్నారు.
చైన్నై, ఢిల్లీ, పూణేలో ఆడే మ్యాచులకు ఆగస్టు 31 నుంచి, ధర్మశాల, లక్నో, ముంబైలో ఆడే మ్యాచులకు సెప్టెంబర్ 1 నుంచి టికెట్లు అందుబాటులోకి వస్తాయి. మరోవైపు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ టికెట్లను సెప్టెంబర్ 15న బీసీసీఐ విడుదల చేయనుంది.