పీసీబీకి భారీ షాకిచ్చిన ఐసీసీ.. అహ్మబాద్‌లోనే భారత్-పాక్ మ్యాచ్
వన్డే ప్రపంచకప్-2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచుకు వేదికను అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియాన్ని బీసీసీఐ ఖరారు చేసింది. దీనిపై పాక్ బోర్డు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్‌కు ఐసీసీ ఝలక్ ఇచ్చింది. అహ్మదాబాద్ స్టేడియంలో భారత్ తో ఆడకూడదన్న పాకిస్థాన్ నిబంధనను ఐసీసీ తిరస్కరించినట్లు సమాచారం. ప్రపంచ కప్ కు ముందు ఆసియా కప్ విషయంలోనూ భారత్-పాకిస్థాన్ బోర్డుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే పాకిస్థాన్ వేదికగా జరిగే ఆసియా కప్ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించిన విషయం తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారమే వరల్డ్ కప్ మ్యాచులు
అదే విధంగా పాక్ జట్టు చైన్నైలో ఆప్ఘనిస్తాన్‌తో, బెంగుళూరులో ఆస్ట్రేలియాలో మ్యాచులు అడదని , ఈ రెండు వేదికలను మార్చాలని పీసీబీ డిమాండ్ చేసింది. అయితే పాక్ అభ్యర్థను బీసీసీఐ, ఐసీసీ పూర్తిగా తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దయాదుల మధ్య పోరు జరగనుంది. ఆక్టోబర్ 15న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మధ్య ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ జరగనుంది దేశవ్యాప్తంగా ఉన్న 12 వేదికల్లో వరల్డ్ కప్ మ్యాచులు జరగనున్నాయి.