Page Loader
ICC: హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దమవుతున్నఐసీసీ!
హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దమవుతున్నఐసీసీ!

ICC: హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దమవుతున్నఐసీసీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2024
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై ఐసీసీ తన చర్యలను వేగవంతం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నమెంట్ పాకిస్థాన్‌లో నిర్వహించాల్సి ఉంది. అయితే, భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడేందుకు నిరాకరించడంతో, హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేయాలని ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనపై పీసీబీ నుంచి ఇంకా ఎటువంటి స్పష్టమైన స్పందన రాలేదు. తాజా సమాచారం ప్రకారం, ఐసీసీ హైబ్రిడ్ మోడల్ అమలుకు సిద్ధమైందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. పాక్ అంగీకరించకపోతే ఆర్థికంగా పెద్ద నష్టాలు ఎదురవుతాయని, టోర్నీ వేదికను మార్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది. పాక్ అంగీకరించిన పక్షంలో, నవంబర్ 29 నాటికి షెడ్యూల్‌ను విడుదల చేయడానికి ఐసీసీ సన్నద్ధమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించడానికి సిద్ధంగా ఐసీసీ 

వివరాలు 

టోర్నమెంట్‌ను సజావుగా నిర్వహించడం మా ప్రాధాన్యత: ఐసీసీ 

హైబ్రిడ్ మోడల్ ప్రకారం,టోర్నమెంట్‌లోని 10 మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయి.మిగిలిన ఐదు మ్యాచ్‌లు (అందులో ఒక సెమీఫైనల్, ఫైనల్‌ సహా) ఇతర దేశాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్, అబుదాబీ లేదా దక్షిణాఫ్రికాలో జరిగే అవకాశం ఉందని సమాచారం. పాక్‌కు, ఐసీసీ ప్రతిపాదనను అంగీకరించడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు చెబుతున్నారు. ''టోర్నీ నిర్వహణ కోసం హైబ్రిడ్ మోడల్‌ను పాక్‌కు ప్రతిపాదించాం. భారత మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు, టీమ్ ఇండియా ఫైనల్ చేరితే దుబాయ్ లేదా అబుదాబీలో ఆ మ్యాచ్‌ను నిర్వహించేందుకు సిద్ధమని సూచించాం. పాక్ అంగీకరించకపోతే కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడం. మా ప్రాధాన్యత టోర్నమెంట్‌ను సజావుగా నిర్వహించడంలోనే ఉంది'' అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.