Page Loader
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతగా హ్యారీ బ్రూక్
ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్ ది విజేతగా నిలిచిన హ్యారీ బ్రూక్

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతగా హ్యారీ బ్రూక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 13, 2023
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతి నెలా క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి నెలా పురుషుల, మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సోమవారం ప్రకటించింది. మెన్స్ క్రికెట్లో ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అవార్డును సొంతం చేసుకోగా.. ఉమెన్స్ క్రికెట్ విభాగంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లే గార్డనర్ దక్కించుకుంది. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ తర్వాత ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడు బ్రూక్‌ మాత్రమే కావడం విశేషం. బ్రూక్‌కు పోటీగా టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ జడేజా, విండీస్‌ యువ స్పిన్నర్‌ గుడకేశ్‌‌మోటీ పోటీపడినప్పటికీ, చివరికి అవార్డు బ్రూక్‌నే వరించింది.

గార్డనర్

ఉమెన్స్ విభాగంలో విజేత గార్డనర్

అయితే గార్డనర్ ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ స్కివర్-బ్రంట్, దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్‌లను ఓడించి.. గార్డనర్ విజేతగా నిలిచింది. బ్రూక్ టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. అతను న్యూజిలాండ్‌పై రెండు అర్ధశతకాలు , ఒక సెంచరీ బాది ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ 2వ టెస్టులో ఓడిపోయినప్పటికీ బ్రూక్ అత్యధికంగా 186 పరుగులు చేయడంతో అతనికి ప్లేయర్-ఆఫ్-ది-మ్యాచ్ అవార్డు లభించింది. గత నెలలో ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్ విజయంలో ఆస్ట్రేలియా ప్లేయర్ గార్డనర్ కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచింది.