ICC కీలక ప్రకటన.. అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక ప్రకటన చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)లో ట్రాన్స్ జెండర్ల (Transgender)పై నిషేధం విధిస్తూ చర్యలు తీసకుంది.
ICC నూతన నిబంధనల ప్రకారం మగ నుంచి ఆడగా మారిన యుక్త వయస్సు వచ్చిన ఏ ఆటగాడు అయిన మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో పాల్గొనడానికి అనుమతించమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఐసీసీ సెక్సువల్ క్వాలిఫికేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
ఈ ఏడాది 2023 ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన మొదటి లింగ మార్పిడి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన డేనియల్ మేక్ గాహేను మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో ఆడకూడదని నిషేధం విధించింది.
Details
ఆరు టీ20 మ్యాచులను ఆడిన మెక్ గేహె
ఆస్ట్రేలియాకు చెందిన 29ఏళ్ల బ్యాటర్ మెక్ గేహె 2021లో లింగమార్పిడి చేయించుకొని మహిళగా మారాడు.
మెక్ గేహె ఇప్పటివరకూ ఆరు టీ20 మ్యాచులను ఆడింది. 19.66 సగటుతో 95.9. స్ట్రైక్ రేట్‌తో 118 పరుగులు చేసింది.
ఇదంతగా గత ఐసీసీ విధానాల ప్రకారం మెక్ గేహె అంతర్జాతీయ క్రికెట్ లో ఆడింది.
స్విమ్మింగ్, సైక్లింగ్, అథ్లెటిక్స్, రగ్బీ లీగ్, రగ్బీ యూనియన్ వంటి ఇతర క్రీడలలో కూడా ట్రాన్స్ జెండర్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.