Loading...
Shubman Gill: గిల్ విజ్ఞప్తికి ఐసీసీ నో.. టెస్టుల్లో లాలాజలంపై నిషేధం కొనసాగింపు!
గిల్ విజ్ఞప్తికి ఐసీసీ నో.. టెస్టుల్లో లాలాజలంపై నిషేధం కొనసాగింపు!

Shubman Gill: గిల్ విజ్ఞప్తికి ఐసీసీ నో.. టెస్టుల్లో లాలాజలంపై నిషేధం కొనసాగింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్టు క్రికెట్‌లో బౌలర్లకు అనుకూల పరిస్థితులు కల్పించాలన్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విజ్ఞప్తికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి ప్రస్తుతానికి సానుకూల స్పందన కనిపించడం లేదు. బంతిని మెరిపించేందుకు లాలాజలం (Saliva) ఉపయోగించడంపై విధించిన నిషేధాన్ని సమీక్షించే ఆలోచన లేదని ఐసీసీ వర్గాలు వెల్లడించినట్లు ప్రముఖ మీడియా సంస్థ కథనం పేర్కొంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం గిల్ ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించాడు. బంతి త్వరగా మెత్తబడిపోవడం వల్ల బౌలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డాడు.

వివరాలు

బంతి త్వరగా మెత్తబడుతోందన్న గిల్

వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 720/9 స్కోరు చేసి డిక్లేర్ చేసింది.

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చివరి రోజు 120 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 239/5 స్కోరు చేసింది.

దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫలితంగా భారత్‌కు కీలకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో ఉపయోగించిన కూకబురా బంతి చాలా త్వరగా మెత్తబడిపోతోందని గిల్ చెప్పాడు.

బంతిపై లాలాజలం ఉపయోగించేందుకు అనుమతిస్తే బౌలర్లకు కొంతమేర సహాయం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు.

వివరాలు

2020లో తాత్కాలిక నిషేధం.. 2022లో శాశ్వతం

కరోనా మహమ్మారి సమయంలో ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 2020లో ఐసీసీ బంతిపై లాలాజలం ఉపయోగించడాన్ని తాత్కాలికంగా నిషేధించింది.

ఆ తర్వాత 2022 అక్టోబర్ 1 నుంచి ఈ నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ ప్లేయింగ్ కండిషన్స్‌లో శాశ్వతంగా చేర్చింది.

అయితే బంతిని మెరిపించేందుకు చెమటను ఉపయోగించడానికి మాత్రం అనుమతి ఉంది.

బంతికి ఒకవైపు మెరుపును కొనసాగిస్తూ, మరోవైపు సహజంగా అరిగేలా చేయడం ద్వారా స్వింగ్, రివర్స్ స్వింగ్‌కు అవకాశం ఏర్పడుతుంది.

ఈ ప్రక్రియలో లాలాజలం ఉపయోగించడంపై నిషేధం విధించడం బౌలర్లకు ఇబ్బందిగా మారుతోందని కొందరు ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు

లాలాజలంపై నిషేధాన్ని ఎందుకు కొనసాగిస్తోంది?

లాలాజలాన్ని ఉపయోగించడం వల్ల బంతి పరిస్థితిలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని ఐసీసీ భావిస్తోంది.

ముఖ్యంగా చ్యూయింగ్ గమ్, మింట్స్, ఇతర తీపి పదార్థాలు తీసుకున్న తర్వాత లాలాజలంలో మార్పులు రావచ్చు.

అలాంటి లాలాజలాన్ని బంతిపై ఉపయోగిస్తే దాని మెరుపుపై ప్రభావం పడే అవకాశం ఉందని ఐసీసీ అంచనా వేస్తోంది. అంతేకాకుండా ఆటగాళ్లు లాలాజలాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో పర్యవేక్షించడం, నియంత్రించడం కష్టమని భావిస్తోంది.

ఆటగాళ్లు, అంపైర్ల ఆరోగ్య భద్రత కూడా ఈ నిషేధం కొనసాగడానికి మరో కారణంగా చెబుతోంది. అందుకే కరోనా ప్రభావం తగ్గినప్పటికీ ఐసీసీ ఈ నిబంధనను కొనసాగిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

ఐపీఎల్‌లో మాత్రం లాలాజలానికి అనుమతి

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐపీఎల్‌లో మాత్రం 2025 సీజన్ నుంచే బంతిని మెరిపించేందుకు లాలాజలం ఉపయోగించడానికి బీసీసీఐ అనుమతించింది.

పది జట్ల కెప్టెన్లతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వెసులుబాటు ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం. అంతర్జాతీయ టెస్టులు, వన్డేలు, టీ20ల్లో మాత్రం ఐసీసీ నిబంధనే అమల్లో ఉంటుంది.

ఈ నెల ప్రారంభంలో బాలి వేదికగా జరిగిన ఐసీసీ సమావేశాల్లోనూ లాలాజలంపై నిషేధం గురించి చర్చ జరగలేదని సమాచారం.

భవిష్యత్తులో ఈ నిబంధనను మార్చాలంటే ఐసీసీకి చెందిన సంబంధిత కమిటీ ద్వారా ప్రతిపాదన రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత తుది నిర్ణయాన్ని ఐసీసీ బోర్డు తీసుకోవాలి.

ADVERTISEMENT